Poor response to sonia gandhi rally

Electon 2014, Poor response to sonia gandhi rally, UPA Chairperson Sonia Gandhi, Rahul Gandhi, Narendra Modi, UPA acheivements by Sonia Gandhi

poor response to sonia gandhi rally, UPA Chairperson Sonia Gandhi, Rahul Gandhi, Narendra Modi, UPA acheivements by Sonia Gandhi

సోనియాగాంధీ సభలో పల్చబడ్డ జనం

Posted: 04/04/2014 05:03 PM IST
Poor response to sonia gandhi rally

కేంద్రాన్ని పాలించే యుపిఏ సర్కార్ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ బహిరంగ సభంటే అంతకు ముందు జనం బాగా వచ్చేవారు.  ఆసక్తిగా వినేవారు.  కానీ కాంగ్రెస్ ప్రాభవం పడిపోయిందనటానికి నిదర్శనంగా జార్ఖండ్ లో రామ్ గఢ్ లో సోనియా గాంధీ ర్యాలీకి జనాదరణ కరువైంది.

సోనియా గాంధీ ఉపన్యాసమంతా నరేంద్ర మోదీ పేరెత్తకుండానే ఆయనకు ప్రధానమంత్రి సీటు మీదున్న వ్యామోహం గురించి, యుపిఏ ప్రభుత్వం చేసిన పనుల గురించే సాగింది. 

చెప్పిన సమయానికి అరగంట ఆలస్యంగా మొదలైన సోనియా గాంధీ ఉపన్యాసానికి జనాన్ని లోపలికి వెళ్ళమని కార్యకర్తలు ఆహ్వానించినా పెద్దగా ఆసక్తిని కనబరచలేదు.  ఆమె హెలికాప్టర్ దిగిన తర్వాత కూడా జనంలో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. 

రాత్రికి రాత్రే ఏదో చేసేస్తామని ప్రగల్భాలు కొందరు పలుకుతున్నారు కానీ అవన్నీ ప్రధానమంత్రి పదవి చేపట్టటం కోసం చెప్పే కట్టుకథలని, తాము మాత్రం 2009 మేనిఫెస్టోలో ఉన్న అంశాలలో 90 శాతం పూర్తి చేసామంటూ సోనియా గాంధీ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ ఉపన్యాసానికి వచ్చినవారిలో నాలుగోవంతు కూడా రాలేదని చూసినవారు చెప్పుకుంటున్నారు- అది కూడా ఆయన రద్దైన ర్యాలీలో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles