Independent candidate allotted hand election symbol

Independent candidate allotted Hand election symbol, Local body elections in Andhra Pradesh, Municipal elections in AP state

Independent candidate allotted Hand election symbol

స్వతంత్ర అభ్యర్థికి హస్తం గుర్తు

Posted: 04/11/2014 08:36 AM IST
Independent candidate allotted hand election symbol

స్థానిక ఎన్నికలలో కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపేటలో ఎన్నికల కమిషన్ కేటాయించిన ఎన్నికల గుర్తు గొడవ తెచ్చి పెట్టింది.  స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల చిహ్నంగా హస్తం గుర్తు కేటాయించటమైంది.  ఈ విషయంలో మిగిలిన అభ్యర్థులంతా అభ్యంతరాలు తెలపటంతో అధికారులు పోలింగ్ ని నిలిపివేసారు. 

ఖమ్మం జిల్లా వైరాలో కూడా చాలా పోలింగ్ స్టేషన్లలో వోటర్లు వోటెయ్యటం లేదు.  వోటర్ వోటర్ వోటెందుకు వెయ్యటం లేదూ అంటే వోటల్ స్లిప్ ల పంపిణీ కాలేదు అన్నారు.  ఆ పని చెయ్యవలసింది రాజకీయ పార్టీలు.  మరి మీరెందుకు పంపిణీ చెయ్యలేదూ అని అడిగితే పోలీసులు అడ్డుకున్నారన్నారు.

రాజకీయ పార్టీలు వోటర్ స్లిప్ లను పంపిణీ చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారట.  వోటర్ కార్డున్నా అది జాబితాలో ఎక్కడుందో ఆ వోటర్ ఏ బూత్ లో వోటెయ్యాలో తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది కనుక వోటర్ల చేతికి స్లిప్ లు ఇస్తుంటారు.  దానితో పోలింగ్ సిబ్బందికి జాబితాలో చూసి టిక్ పెట్టి వాళ్ళ వేళ్ల మీద సిరా చుక్క పెట్టటం జరుగతుంది.  అయితే స్లిప్ లు ఇస్తున్న వారిని పోలీసులు పంపిణీ చెయ్యనివ్వకపోవటంతో వోటర్లు వోటు వెయ్యటానికి వీల్లేకుండా తయారైంది. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు ఆఖరు విడత పోలింగ్ జరుగుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles