Cosmetics causing male infertility

Cosmetics causing male infertility, Professor Niels Skakkebaek, Copenhagen University Hospital Denmark

Cosmetics causing male infertility

వీర్యకణాలను నిర్వీర్యం చేస్తున్న అలంకరణలు

Posted: 05/12/2014 03:48 PM IST
Cosmetics causing male infertility

మగవాళ్ళ అలంకరణలకు ఉపయోగించే కొన్ని ఉపకరణాలు మగవారిలో వీర్యకణోత్పత్తి సంఖ్యను తగ్గిస్తున్నాయని, దానితో వారిలో సంతోనోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయని పరిశోధనలో తెలిసింది.  కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్న సంతానోత్పత్తికి కారణం తెలియక చేస్తున్న పరిశోధనలో మనిషి తయారుచేసిన కృత్రిమ అలంకరణలు మగవారిలో పటుత్వాన్ని తగ్గిస్తున్నాయని తెలుసుకున్నారు.  ఇలా కాస్మెటిక్స్ కి, వీర్యకణోత్పత్తికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని మొదటిసారి శాస్త్రజ్ఞలు వెలికితీసారు.  

కాస్మెటిక్స్ కి మగవారిలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవటానికి గల సంబంధాన్ని నిరూపించగలమని, దానితో ఏ ఉత్పాదనలను బహిష్కరించాలి, వేటిని నియంత్రించాలి అన్నది యూరప్ లోని నియంత్రణా వ్యవస్థ నిర్ణయించవలసివుంటుందని పరిశోధకులు అన్నారు.  

కొన్ని సందర్బాల్లో ఈ కాస్మెటిక్స్ లో ఉపయోగించిన రసాయనాలు స్త్రీ సెక్స్ హార్మోన్లైన ఓయస్ట్రోజెన్స్ నా భ్రమింపజేయటం, కొన్ని సందర్భాల్లో పురుష సెక్స్ హార్మోన్లైన ఆండ్రోజెన్స్ కి వ్యతిరేకంగా పనిచెయ్యటం చేస్తున్నాయని కనుగొన్న పరిశోధకులు, దాని వలన పురుషులలోని సంతానోత్పత్తికి చెందిన వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయని అన్నారు.  

డెన్మర్క్ లోని కోపెన్ హాజెన్ యూనివర్శిటీ లోని ప్రొఫెసర్ నీల్స్ స్కక్కేబేక్ చెప్పిన దాని ప్రకారం పై విధంగా, పురుషుల పురుషత్వాన్ని దెబ్బతీసే వాటిల్లో టూత్ పేస్ట్ లు, సన్ స్క్రీన్ లోషన్లు, డెజర్జెంట్లు, ఉపయోగిస్తున్న ప్లాస్టిక్స్ వలన సులువుగా కదలాడే వీర్యకణాలలో అవరోధం కలిగించి అవి పూర్తిగా పక్వానికి రాకముందే బయటకు వచ్చేట్టుగా చేస్తున్నాయని, దానివలన స్త్రీ అండాలను ఛేదించి ఫలదీకరణం చేసే శక్తిని ఎంజైమ్స్ కోల్పోతున్నాయని తెలిసింది.  దాని వలనే వీర్యకణం నిర్వీర్యమైపోతోంది.  విచిత్రంగా, ఆ కాస్మెటిక్స్ లోని గుణాలు ఒకదానితో ఒకటి కలిసి "కాక్ టైల్ ప్రభావం" చూపిస్తున్నాయని పరిశోధకులు కనిపెట్టారు.

అంటే, అలంకరణ సామగ్రి కుటుంబ నియంత్రణ బాధ్యతలను చేపట్టాయన్నమాట!

మనదేశంలో పసుపు రాసుకోవటం దగ్గర్నుంచి వివిధ అలంకరణలను స్త్రీలకే పరిమితం చేసారు మనవాళ్ళు.  పురుషులను వాటికి దూరంగా ఉంచారు. అందువలన మనదేశంలో ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టవలసివచ్చిందే కానీ యూరప్ లో జరుగుతున్న విధంగా పురుషులలో సంతానోత్పత్తికి అవసరమైన శక్తి క్షీణించటం అన్నది నామమాత్రంగా ఉందేమో కానీ సమాజంలో ఒక సమస్యలా పొడసూపలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles