Narsinga rao ias leaves coal india to serve telangana

Narsinga Rao IAS leaves Coal India to serve Telangana, Coal India CMD to work for CM Peshi, Narsinga Rao IAS sacrifices for Telangana, Telangana CM KCR

Narsinga Rao IAS leaves Coal India to serve Telangana

తెలంగాణా ఋణం తీర్చుకోవటానికి..

Posted: 05/21/2014 10:45 AM IST
Narsinga rao ias leaves coal india to serve telangana

కోల్ ఇండియా ఛైర్మన్ నర్సింగరావు ఐఏఎస్ తెలంగాణా సిఎం పేషీలోకి రావటం చర్చనీయాంశమైంది.   నెలకి నాలుగు లక్షల రూపాయల జీతం, బయటకు వెళ్ళటానికి హెలికాప్టర్, వారానికోసారి విదేశ పర్యటనలాంటివి గల పెద్ద హోదాను వదిలి పెట్టి సిఎం పేషీగా రావటానికి నర్సింగరావు ఏమాత్రం వెనకాడటం లేదు సరికదా అది తన భాగ్యమంటున్నారు.  ఈ విధంగా తెలంగాణా ఋణం తీర్చుకుంటానని, తెలంగాణా తల్లి సేవకంటే పదవులు ముఖ్యం కాదని అంటున్నారాయన.  
మెదక్ జిల్లాలో మారు మూల గ్రామమైన చిన్న గొట్టిముక్కలలో జన్మించిన నర్సింగరావు ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత మూడు సర్వీసుల్లో ఎంపికయ్యారు.  ముందుగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆ తర్వాత ఐపిఎస్, ఆ తర్వాత ఐఏఎస్ కి ఎంపికయిన నర్సింగరావు ఏడాదికి 25 కోట్ల పైన ఆదాయం గల కోల్ ఇండియా సంస్థకు సిఎండీగా చేరారు.  
అంత పెద్ద హోదా నుండి కేవలం కెసిఆర్ పిలుపు మేరకు ఆయన సిఎం పేషీకి నాయకత్వ బాధ్యతలను నిర్వహించటానికి సిద్ధమైన నర్సింగరావు తన నిర్ణయానికి విస్మయానికి గురైనవారికి చెప్పిన మాట ఒకటే- తెలంగాణా కోసం అంతమంది బలిదానాలు చెయ్యగా నాది పెద్ద త్యాగం కాదని అన్నారాయన.  కోల్ ఇండియాలో ఉంటే ఆ సంస్థకు మాత్రమే సేవ చెయ్యవచ్చు కానీ నాకిప్పుడు పుట్టినగడ్డకు సేవచేసే అవకాశం లభిస్తోందని అన్నారాయన.  కెసిఆర్ గురించి మాట్లాడుతూ ఆయన మంచి ద్రష్ట, ముందుచూపున్న నాయకుడు.  ఆయన తెలంగాణాను అభివృద్ధిచేస్తారనే నమ్మకం నాకుంది అని అన్నారు నర్సింగరావు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles