Temporary secretariat at acharya nagarjuna university

Temporary secretariat for new state of Andhra Pradesh, Temporary secretariat at Acharya Nagarjuna University, Babu to operate from Guntur as CM of AP

Temporary secretariat at Acharya Nagarjuna University

గుంటూరులో తాత్కాలిక సచివాలయం?

Posted: 05/21/2014 11:57 AM IST
Temporary secretariat at acharya nagarjuna university

గుంటూరు నుంచి రాష్ట్ర కార్యకలాపాలను నిర్వహించటానికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు.  అందుకు తగ్గట్టుగా తాత్కాలిక సచివాలయం, సిఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం 3 నెలలలో పూర్తికానున్నాయి.  అందుకు గుంటూరు విజయవాడ రోడ్డులో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్థలాన్ని ఎంచుకున్నారు.  

కొత్త రాజధాని నిర్ణయం జరిగే వరకు అక్కడి నుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలను నిర్వహించనున్న చంద్రబాబు జూన్ 2 న రాష్ట్ర ఆవిర్భావ అధికార ప్రకటన జరిగి రెండు రాష్ట్రాల ఆవిర్భావం జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తానని, సీమాంధ్రనే కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం తీసుకుని వస్తానని మంగళవారం ఢిల్లీలో తెలియజేసారు.  

10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించబడ్డ హైద్రాబాద్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక కార్యాలయాలను సిద్ధం చేస్తున్నా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోనే చంద్రబాబు తన కార్యాలాయాన్ని రూపొందించుకుంటున్నారు.  

ఎక్కువగా ఆదరణ లభించిన సీమాంధ్రను అభివృద్ధి చెయ్యటం తన ధర్మంగా భావిస్తున్న చంద్రబాబు ఆ ప్రాంతాన్నే తన కేంద్రస్థానంగా చేసుకోవటమే తగిన చర్యని భావిస్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles