Another libel case on aap leaders

Another libel case on AAP leaders, Shazia Ilmi served bailable warrant, Shazia Ilmi leaves AAP, Amit Sibal defamation case against AAP leaders

Another libel case on AAP leaders

ఆఆపా మీద మరో పరువునష్టం దావా!

Posted: 05/24/2014 04:29 PM IST
Another libel case on aap leaders

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షాజియా ఇల్మి, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మరికొందరు నాయకుల మీద మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ మీద నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు బాధితుడు కోర్టులో వేసిన పరువు నష్టం దావా మీద కోర్టుకు హాజరు కానందుకు ఢిల్లీ కోర్టు షాజియా ఇల్మి మీద బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  

ఈ కేసులో హాజరు కానందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, ఇంకా ఇతర నాయకులు మనీష్ శిసోడియా, ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మి లకు ఈసారి హాజరు కాకపోతే బలవంతంగా కోర్టుకు ఈడ్చుకుని రావలసివస్తుందని పోయిన నెలలో కోర్టు నోటీసులు పంపించింది.  

ఈరోజు మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ సునీల్ కుమార్ శర్మ, ఎన్నిసార్లు సమన్లు పంపించినా హాజరు కానందుకు ఇల్మి మీద బెయిలబుల్ వారెంట్ జారీచేసారు.

ఈరోజే షాజియా ఇల్మి, కేప్టెన్ గోపీనాధ్ లు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.

ఇప్పటికే భాజపా నేత నితిశ్ గడ్కరీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టుకి హాజరైన కేజ్రీవాల్ బెయిల్ బాండ్ ఇవ్వక తిహార్ జైల్లో ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles