Modi day at sea

Modi day at sea, Modi on board INS vikramaditya, Modi in MIG 29 K, PM Modi first visit to Military outfit

Modi day at sea

ప్రధాని మోదీ 'సాగరంలో ఒకరోజు'

Posted: 06/14/2014 03:07 PM IST
Modi day at sea

ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా మిలిటరీ సాధనాలను సందర్శించటానికి ఈరోజు నరేంద్ర మోదీ భారతదేశ అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద కాలు మోపారు.  ఆ నౌక గోవా నుంచి బయలు దేరగా దాని మీద ఉన్న యుద్ధ విమానం మిగ్-29 కె ఫైటర్ జెట్ కాక్ పిట్ లో కూర్చుని నావికాదళ అధికారులతో ఆయన ముచ్చటించారు.  

గోవాలోని ఐఎన్ఎస్ హంసా నేవల్ ఎయిర్ స్టేషన్ కి ఉదయం 10 గంటలకు చేరుకున్న మోదీకి నేవీ ఛీఫ్ అడ్మైరల్ ఆర్ కే ధోవాన్ స్వాగతం పలికారు.  గార్డ్ ఆఫ్ హానర్ అయిపోయిన తర్వాత మోదీ 44500 టన్నుల ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ లో ప్రయాణం చేసారు.  'సముద్రంలో ఒకరోజు' గడిపిన మోదీ యుద్ధనౌకలు మిగ్ 29 కె, పి-81, యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలను తిలకించారు.  ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద నుండి టేక్ ఆఫ్, ల్యాండిగ్, తక్కువ ఎత్తులో ఎక్కువ వేగంగా వెళ్ళటాన్ని చూసారు.

నేవీ అధికారులతో విషయాలు అడిగి తెలుసుకుని, వాళ్ళంతా వాటిని ఉపయోగిస్తూ పని చేసే విధానం, అతి శక్తి వంతమైన ఆ యుద్ధ నౌక గురించి తెలుసుకోవటం చాలా ఆనందమనిపించిందని అన్నారు మోదీ.  అయితే యుద్ధ పరికరాలను మనం దిగుమతి ఎందుకు చేసుకుంటున్నాం, మనం నిర్మించుకోగలగాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రష్యాను తెచ్చుకున్నాం మనం.  ఇది సరికొత్తదే కాకుండా నావికాదళంలో అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక.  దీన్ని పోయిన సంవత్సరం నవంబర్లో అప్పటి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ రష్యాలో సేవ్మాష్ షిప్ యార్డ్ నుంచి భారత దేశపు నావికా దళంలో చేర్చారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles