Fake death created for insurance money

Fake death created for insurance money, Indian Sanjay Kumar insurance fraud, Sanjay and Anju Kumar couple in insurance fraud,

Fake death created for insurance money to pay off debts

ఇన్సూరెన్స్ సొమ్ముకోసం అబద్ధపు చావు

Posted: 06/18/2014 05:01 PM IST
Fake death created for insurance money

వాట్ ఫోర్డ్ లో వ్యాపారి సంజయ్ కుమార్ మిలియన్ పౌండ్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తను చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసాడు.  అందుకు భారత్ నుంచి దొంగ మరణ ధృవీకరణ పత్రాన్ని సంపాదించాడు.  ఆయన వయసు 46 సంవత్సరాలు.  ఆయన భార్య అంజు కుమార్ తన భర్త మెదడు వాపుతో మరణించారని ప్రకటించింది.  

ఇదంతా ఎందుకంటే సంజయ్ కుమార్ కి వ్యాపారంలో నష్టాలు రావటం అప్పుల్లో కూరుకుపోవటం జరిగింది.  కానీ ఏదో చిన్న విరోచనాలు తప్పితే అతను భారత దేశం లో ఉన్న సమయంలో అతనికి మరింకేమీ లేదని కోర్టుకి తెలిసిపోయింది.  

భారతదేశంలో పుట్టిన సంజయ్ కుమార్ కి బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది.  నవంబర్ 2011 లో ఢిల్లీ వెళ్ళిన సంజయ్ కుమార్ తనకు అస్వస్థతగా ఉందని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో తనను హాస్పిటల్ లో చేర్చారని  భార్యకు ఇమెయిల్ చేశాడు.  ఆ తర్వాత సంజయ్ మెదడు వాపుతో మరణించారని ఆమెకు మరో ఇ మెయిల్ వచ్చింది.  అయితే ఆ సమయంలో కుమార్ భారత దేశంలో తను చనిపోయినట్లుగా దొంగ ధృవీకరణ పత్రాన్ని సంపాదించే పనిలో ఉన్నాడు.  అప్పటికి వాళ్ళకి ముగ్గురు టీనేజ్ పిల్లలున్నారు.  

death-certificate

ఆ ఆధారంతో స్కాటిష్ ప్రావిడెంట్ నుంచి 2,50,000 పౌండ్లు, అవివా లో టెర్మ్ పాలసీ నుంచి 4,50,000 పౌండ్లు, అదే అవివా నుంచి సెకండ్ టెర్మ్ అస్యూరెన్స్ సొమ్ము 4,50,000 పౌండ్లు, ఇవి కాకుండా మరణం వలన లీగల్, జనరల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే పెన్షన్ 5789.38 పౌండ్లను, వెరసి 1,155,789.38 పౌండ్లను కొట్టేయటానికి క్లెయిమ్ చేసాడతను తన భార్య ద్వారా.  

అయితే ప్లానంతా బెడిసికొట్టింది.  దంపతులిద్దరూ కోర్టుకి పోవలసివచ్చేటప్పిటికి వాళ్ళ చేతికి కేవలం 10615.49 పౌండ్లు మాత్రమే చిక్కాయి.  అవివా, స్కాటిష్ ప్రావిడెంట్ ఫండ్ల సంస్థలకు కుమార్ మరణం మీద అనేక అనుమానాలు వచ్చి దర్యాప్తుకి పూనుకున్నారు.  వాళ్ళ అనుమానాన్ని నిజం చేస్తూ అంజు కుమార్ తన భర్త చనిపోయాడని చెప్పిన రెండు రోజుల తర్వాత ఆమె అతనికి వెస్టర్న్ యూనియన్ ద్వారా 1,522 పౌండ్లను పంపించింది, దాన్ని అతను భారత్ లో అందుకున్నాడు.

తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మీద దర్యాప్తు చేసే లండన్ పోలీసు శాఖకి సంజయ్ పీకలలోతు అప్పుల్లో కూరుకునిపోయినట్టు తేలింది.  కుమార్ దంపతులు మార్టిగేజ్ చేసిన వాట్ ఫోర్డ్ ఇంటి మీద ఏమాత్రం మిగలటం లేదు.  

ఇంతలో తన భార్య అంజు కుమార్ ని కలుసుకోవటం కోసం సంజయ్ కుమార్ మరో మారు పేరుతో లండన్ వచ్చాడు, వెంటనే పట్టుబడ్డాడు.  ఈ కేసు వచ్చిన సౌత్ వార్క్ క్రౌన్ కోర్టులో జడ్జ్ డేవిడ్ హిగ్గిన్స్ వాళ్ళిద్దరినీ దొంగలు అని అన్నారు.  చాలా చాకచక్యంతో చేసారు కానీ చాలా తప్పు చేసారని అన్న జడ్జ్, ఇలాంటి నేరం చేసిన మీకు దానికి తగ్గ శిక్షను కూడా అనుభవించవలసివస్తుంది అన్నారు.  

కోర్టులో దంపతులిద్దరూ దోషాన్ని ఒకరిమీదకు మరొకరు తోసుకునే ప్రయత్నం చేసారు.  ఇద్దరూ ముఖాలు చూసుకోకుండా ఎడముఖం పెడ ముఖంగా ఉన్నారు.  సంజయ్ కుమార్ కి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది, అతను చేసిన 1,155,789.38 పౌండ్ల ఆర్థిక నేరానికి ఆరు రెట్లు మొత్తానికి, అంజు కుమార్ కి 10,615.49 పౌండ్లకు రెండు రెట్లకు బాధ్యులయ్యారు.  సెప్టెంబర్ 29 నుంచి 10,615.49 పౌండ్ల విలువకు కాన్ఫిస్కేషన్ ప్రొసీజర్ ప్రారంభమౌతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles