The extent of details of indian account holders in swiss banks

Indian account holders in Swiss banks, Special Investigation Team on black money, SIT gears up for action on black money holders, Swiss Government ready reveal certain Indians details

The extent of details of Indian account holders in Swiss banks

స్విస్ బ్యాంకుల్లో ఖాతాల వివరాలు ఏమేరకు?

Posted: 06/23/2014 09:03 AM IST
The extent of details of indian account holders in swiss banks

భారత్ లోని కొత్త ప్రభుత్వంతో సహకరించటానికి స్విస్ బ్యాంక్ లు సిద్ధపటడటం విశేషం.  ఈ మలుపు మోదీ ప్రభుత్వం కిరీటంలో కలికితురాయి లాంటిది.  అధికారంలోకి వచ్చిన నెలల్లోనే దశాబ్దాలుగా స్విస్ బ్యాంక్ లలో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసిన ఘనత భాజపా కి దక్కుతుంది.

స్విస్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 283 స్విస్ బ్యాంక్ లలో కేవలం రెండు బ్యాంక్ లలోనే భారతీయుల మొత్తం నిల్వలలో మూడవ వంతు ఉన్నాయి.  అవి యుబిఎస్, క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ లు.  స్విస్ బ్యాంక్ లు భారతీయ ఖాతాదారులకు తిరిగి ఇవ్వవలసిన సొమ్ముగా వారి లెక్కలలో చూపించే మొత్తం భారతదేశ కరెన్సీలో రూ.11000 కోట్లు (1.6 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్).  స్విస్ బ్యాంక్ లలో నేరుగా వ్యక్తులు లేక సంస్థల పేర్లతో ఉన్న నిల్వలు 1.95 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్.  మరో 77.3 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ సొమ్ము ఫిడ్యూషరీస్- అంటే క్లయింట్ల ధనాన్ని మేనేజ్ చేసేవారి దగ్గర ఉన్నాయి.  

స్విస్ బ్యాంక్ లలో డబ్బు దాచుకున్న భారతీయుల వివరాలను వెల్లడిస్తామంటూ స్విస్ బ్యాంక్ లు ముందుకు రావటంతో నల్లధనం మీద భారత్ లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్డియే నెలకొల్పిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుని కొనసాగించటానికి తగు చర్యలు తీసుకుంటోంది.  సిట్ కి సారధ్యం వహిస్తున్న జస్టిస్ ఎమ్ బి షా ఈ విషయంలో మాట్లాడుతూ,  భారతీయుల జాబితాను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.  

అయితే స్విస్ ప్రభుత్వం ఇస్తున్నది భారత్ లో పన్ను ఎగవేత కోసం స్విస్ బ్యాంక్ లలో డబ్బు దాచుకున్న భారతీయుల వివరాలు మాత్రమే.  కానీ వినియోగదారుల గోప్యతను పరిరక్షించవలసిన అవసరం ఉన్నందున మొత్తం జాబితా, అందులో వాళ్ళ నిల్వల వివరాలను భారత్ కి అందించటానికి స్విస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు.  కానీ భారత్ లోని కొన్ని ట్రస్ట్ లు, కంపెనీలు భారత్ కి కట్టవలసిన పన్నుని కట్టకుండా తప్పించుకోవటం కోసం తెరిచిన ఖాతాల వివరాలు ఇవ్వటానికి సిద్దపడింది.  

స్విస్ బ్యాంక్ లలో 2013 లో భారతీయుల నిల్వలు గణనీయంగా పెరిగాయని స్విస్ బ్యాంక్ లు ప్రకటన చేసిన నేపథ్యంలో వెంటనే స్విస్ ప్రభుత్వం భారత్ ప్రభుత్వంతో ఈ విధంగా సహకరించటానికి చూడటం విశేషం.

ఇంతకు ముందు హెచ్ఎస్ బిసి లాంటి కొన్ని బ్యాంక్ లు అనధికారికంగా భారత్ కి ఇచ్చిన భారత్ ఖాతాదారుల జాబితాల ఆధారంగా భారత ప్రభుత్వం స్విస్ ప్రభుత్వాన్ని వాళ్ళ వివరాలను కోరింది.  అయితే అలాంటి లీక్ అయిన, దొంగతనంగా చేరిన జాబితాల  ఆధారంగా కాకుండా స్విస్ ప్రభుత్వం అప్పటికప్పుడు ఉన్న పరిస్థితికి అనుగుణంగా (స్పాన్టేనియస్ గా) వివరాలను ఇస్తామంటోంది.  హెచ్ఎస్ బిసి నుంచి లోగడ వచ్చిన ఖాతాదారుల నల్లధనం వివరాలు ఆయా ఖాతాదారులు అక్రమంగా సంపాదించిన సొమ్మంటూ తెలియజేయటం జరిగింది.  

ఏది ఏమైనా, వివరాలు ఎంతవరకు వచ్చినా, భారతీయులు స్విస్ బ్యాంక్ లలో దాచుకున్న నల్లధనం వివరాలతో కొంతవరకైనా అక్రమంగా దాచుకున్న ధనాన్ని తిరిగి రాబట్టటంలో ముందడుగు పడుతుంది.  కనీసం పన్ను రూపంలో భారత ప్రభుత్వానికి కొంత ఆదాయం లభిస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles