Leaders of other parties joining trs

kcr operation akarsha, leaders of other parties joining trs, congress party leaders join trs, leaders from other parties likely to join the trs

Leaders of other parties joining TRS

పుట్టినగడ్డ కోసం అమ్మనే వదులుతూ...

Posted: 06/26/2014 11:29 AM IST
Leaders of other parties joining trs

అబ్బే, అమ్మమీద మాకేం కోపం అంటున్నారు ఆమోస్.  సోనియా గాంధీ మీద కోపం లేదు, కాంగ్రెస్ మీద విశ్వాసమూ పోలేదు.  కానీ పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉండటం కూడా అవసరమే.  అందుకే బంగారు తెలంగాణా కోసం తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరుతున్నామంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆమోస్ తదితరులు.  

రాజకీయం అంటేనే అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం వేసే ఎత్తులకు పై ఎత్తులు.  అందువలన ఏ పార్టీలో రాజకీయంగా ఎదుగుదలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుందో, ఆ పార్టీలోకి పోవటం, మునుగుతున్న నావను వదిలినట్లుగా అంతవరకు ఉన్న పార్టీని విడిచిపెట్టటం రాజకీయాల్లో తప్పులేమీ కావు.  కానీ అలా వదిలిపోతున్నందుకు తమను తాము సమర్థించుకుంటూ ఆ పార్టీ నాయకుల మీద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తుంటారు.  పార్టీ పెద్దలు నియంతల్లా ప్రవర్తిస్తున్నారనో లేకపోతే తన మాటకు విలువనివ్వటం లేదనో, లేదంటే పార్టీ చేసిన ప్రకటనలలో లోపాలెంచో మరెన్నో వంకలను కూడా చూపెడుతుంటారు.  

కానీ ఈసారి తెలంగాణా నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇంతవరకూ ఎవరూ చెయ్యనివి, కాంగ్రెస్ అధిష్టానానికి ఏం చెప్పాలో పాలుపోకుండా చేసినవి.  కాంగ్రెస్ మంచిదే, సోనియమ్మా మంచిదే కానీ తెలంగాణాను బంగారు తెలంగాణా చెయ్యటం కోసం వదిలిపెట్టి పోవలసివస్తోందన్నది సరికొత్త వివరణ.

లోగడ చేసినట్లుగానే కెసిఆర్ ఆపరేషన్ ఆకర్షను మరోసారి ప్రారంభించారు.  ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగు దేశం పార్టీ నుంచి, బిఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి మద్దతుదార్లు తెరాసలో చకచకా చేరిపోతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles