Telugu thalli and telangana thalli

Telugu Thalli and Telangana Thalli, Telugu Academy on Telangana books, Telangana Intermediate books with Telugu Academy

Telugu Thalli and Telangana Thalli

అన్నదమ్ముల్లా విడిపోదాం కానీ మా తల్లి వేరు

Posted: 06/28/2014 11:16 AM IST
Telugu thalli and telangana thalli

అన్నదమ్ముల్లా విడిపోదాం.  కక్షలు, ద్వేషాలు, పగలు వద్దు. తెలంగాణాలోని తెలుగువాళ్ళని కడపులో పెట్టుకుని ఆదరిస్తాం, వాళ్ళ ఆస్తులకు నష్టం కలగనివ్వం.  ఇవన్నీ తెలంగాణా నాయకులు చేసిన వాగ్దానాలు.

చెప్పినట్లుగానే ఏ గొడవలూ లేకుండానే విభజన ప్రక్రియ జరిగిపోయింది.  ఇక పంపకాలంటారా ఇంకా ఒక కొలిక్కి రాలేదు కాTelugu Thalli and Telangana Thalliనీ నెమ్మదిగా వస్తాయి.

అయితే ఆంధ్ర ప్రదేశ్ కి, ఆ రాష్ట్ర విభజనకి చాలా ప్రత్యేకతలున్నాయి.  అందులో ఒకటి మొదటి భాషా ప్రవక్త రాష్ట్రమూ ఆంధ్రప్రదేశే, ఒకే భాష మాట్లాడే రాష్టం రెండుగా విడిపోయిన సందర్భమూ ఇదే.  

కానీ తెలంగాణా ప్రత్యేకతను కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణా నాయకులు తెలుగుతల్లిని మా తల్లి కాదు అన్నారు.  మాది తెలంగాణా తల్లి అంటూ ఆమె విగ్రహాన్ని తయారుచేసుకున్నారు.  అన్నదమ్ముల్లా విడిపోవచ్చు కానీ తల్లిని కూడా విడదీయలేము కదా.  కానీ అదే జరిగింది.  అయితే ఉద్యమ నేపథ్యంలో, కొన్ని సందర్భాల్లో ప్రజలను సంఘటితపరచటం కోసం, రాజకీయ నాయకులకు కొన్ని విషయాలను చెప్పవలసివస్తుంది కాబట్టి అలా చెప్పారనుకుందాం.  

అయితే అనుకున్నది సాధించారు కాబట్టి కొన్ని విషయాలలో ఇంకా పట్టుదల ఎందుకని అనుకున్నట్టున్నారు.  తెలుగు అకాడమీని మాత్రం అలాగే ఉంచేసారు.  వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఎపి అనే అక్షరాలు వద్దని అన్నారు కానీ ఇంటర్మీడియేట్ పుస్తకాల మీద తెలంగాణా రాష్ట్ర అధికార ముద్ర ఉంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియేట్, హైద్రాబాద్, తెలంగాణా అని ఉంది కానీ అకాడమీ పేరు మాత్రం ఇంకా తెలుగు అకాడమీ అనే వుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles