Self attestation preferred by govt to notary

Self attestation prefered to Notary, Self Attestation allowed in Govt offices, Attestation by Gazetted officer not compulsory

Self Attestation preferred by Central Govt to notary and Gazetted officers attestation and asked state governments to follow

ఇక సెల్ఫ్ అటెస్టేషన్ కే పెద్దపీట- కేంద్రం నిర్ణయం

Posted: 07/16/2014 11:33 AM IST
Self attestation preferred by govt to notary

కార్యాలయాల్లో వివిధ అప్లికేషన్లకు జతపరచే పత్రాలను అటెస్ట్ చేసే నియమంలో సడలింపు కోసం భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ప్రైవేట్ సంస్థలు, బ్యాంక్ లు సెల్ఫ్ ఎటెస్టేషన్ చేసి ఇస్తే సరిపోతుందని అనటం మొదలుపెట్టినా, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇంకా గెజెటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలని, నోటరీ చేయించాలన్న నిబంధనకే అంకితమై పనిచేస్తున్నారు.  ఈ ఆచారానికి స్వస్థి చెప్తూ,  అఫిడవిట్ లలో సెల్ఫ్ ఎటెస్టేషన్ కే ప్రాధాన్యతనీయాలని కేంద్ర ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలో భాగంగా నిర్ణయం తీసుకుంది.  

ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవటంలో ఉండే ఒక కష్టం తొలగిపోయింది.  నోటరీ, అటెస్టేషన్ చేసేవాళ్ళు తప్పులు జరిగిన సందర్భంలో బాధ్యత తీసుకున్న దాఖలాలైతే లేవు.  అలాంటప్పుడు వాళ్ళ అటెస్టేషన్ కి విలువేముంది.  దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి నిర్ణయాలను తీసుకోవాలని, పెండింగ్ లో పెట్టరాదన్న నిర్ణయం ముందే అమలులోకి వచ్చింది కాబట్టి ఇక మీదట ప్రభుత్వ కార్యాలు చకచకా చేయించుకోవటానికి వెసులుబాటు కలుగుతుందని చాలామంది ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు.   పౌరుడు కేంద్రంగా పాలన అన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి తగ్గట్టుగా జరుగుతున్నవే ఈ సంస్కరణలు.
 
ఈ దిశగా రాష్ట్ర స్థాయిలో కూడా పరివర్తన తీసుకునిరావలసిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.  కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని విషయాలలో సెల్ఫ్ అటెస్టేషన్ కి ప్రాధాన్యతనిచ్చారు.  అంతిమ పరిశీలన సమయంలో వాళ్ళని ఒరిజినల్స్ పట్టుకుని రమ్మని కోరటం జరుగుతోంది.
 
గెజెటెడ్ ఆఫీసర్ లేక నోటరీ అటెస్టేషన్ విధానంలో పౌరులకు డబ్బు ఖర్చుతో పాటు సమయం కూడా వృధా అవుతోంది.  ఈ కొత్త విధానం వలన ప్రభుత్వ కార్యాలయాలతో పనిపడ్డప్పుడు సామాన్యంగా ప్రజల్లో ఉండే సంశయభావం కూడా ఇలాంటి సంస్కరణలవలన తొలగిపోయే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles