Beas river incident remembered in loksabha

hyderabad students dead in beas river, hyderabad students on study tour die in beas river, union minister smriti irani rememberes beas incident, directives to colleges conducting study tours

Beas river incident remembered in Loksabha and directives to colleges conducting study tours to be issued soon as stated by Union Minister Smriti Irani

లోక్ సభలో బియాస్ దుర్ఘటనా స్మృతి

Posted: 07/16/2014 06:33 PM IST
Beas river incident remembered in loksabha

బియాస్ లో జరిగిన దుర్ఘటనను ఈ రోజు లోక్ సభలో గుర్తు చేసుకోవటం జరిగింది.  ఈ ఘటన మీద కేంద్రం తీవ్రంగా స్పందించిందంటూ మానవవనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కళాశాలలకు మార్గదర్శకాలను త్వరలోనే తయారు చేస్తామని చెప్పారు.  

హైద్రాబాద్ లోని ఇంజినీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ కి విహార యాత్రకు పోయి సరదాగా గడుపుతూ ఫొటోలు దిగుతున్న సమయంలో డ్యాం గేట్లను అదాటున ఎత్తటంతో 24 మంది విద్యార్థులు అందులో కొట్టుకుపోయారు.  వారిలో 21 మంది మృతదేహాలు లభించాయి.  

ఆ సమయంలో హిమాచల్ సర్కార్ తో సంప్రదించి సహాయక చర్యలు చేపట్టామని చెప్పిన స్మృతి ఇరానీ ఆ ఉదంతం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించివేసిందని అన్నారు.  కళాశాలలన్నీ స్టడీ టూర్లలో విధిగా పాటించవలసిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని అన్నారామె.

ఆ సంఘటనలో మృతి చెందిన హైద్రాబాద్ విఎన్ఆర్ కాలేజ్ విద్యార్థుల కుటుంబీకులు రెండున్నర లక్షల నష్టపరిహారాన్ని కోరగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ఆ పిటిషన్ ని తిరస్కరించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles