Uk resident blackmails tcs

tcs blackmailed by uk resident, uk resident blackmails tcs, tcs data hacked by uk citizen, uk citizen denied employment in tcs, prashant sengal fights with tcs on discrimination

UK resident blackmails TCS holding employees confidential data of the company

టిసిఎస్ ని బ్లాక్ మెయిల్ చేసిన యుకె నాగరికుడు

Posted: 07/17/2014 01:07 PM IST
Uk resident blackmails tcs

భారత దేశంలో పెద్ద ఐటి సంస్థలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ని యుకెకి చెందిన ప్రశాంత్ సెన్గర్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసాడు. టిసిఎస్ కంపెనీ వీసా నియమాలను ఉల్లంఘిస్తోందని, అందుకు సాక్ష్యాధారాలు తన దగ్గరున్నాయని, వాటిని కంపెనీ డేటా బేస్ నుంచి తీసుకున్నానని సెన్గర్ కంపెనీ సిఇవో నటరాజన్ చంద్రశేఖరన్ కి లేఖ రాయగా ఆ కంపెనీ లండన్ లోని హైకోర్టుని ఆశ్రయించింది.  

సెన్గర్ యుకె లో లీమింగ్టన్ స్పా లో స్పైసీ అఫైర్ అనే పేరుతో నడుస్తున్న ఒక రెస్టారెంట్ యజమాని.  అదే చోట టిసిఎస్ కార్యాలయం ఉంది.  అందులో ఉద్యోగం సంపాదిద్దామని సెన్గర్ అక్టోబర్ 2013 నుంచి వివిధరకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు.  కంపెనీ తనకి ఉద్యోగమిస్తానని చెప్పి తిప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపించిందని అన్న సెన్గర్ తనకి ఉద్యోగమివ్వకుండా యుకెకి మైగ్రేట్ అయినవాళ్ళ పట్ల వివక్ష చూపుతోందని, వాళ్ళకి తక్కువ జీతాలివ్వవచ్చన్న దుర్బుద్ధే అందుకు కారణమని అంటున్నాడు.  అలా మైగ్రేట్ అయినవాళ్ళకే ఉద్యోగాలిచ్చినట్లుగా తద్వారా వీసా నియమాలను ఉల్లంఘించినట్టుగా చూపించటానికి తన దగ్గర కంపెనీ డేటా ఉందని అన్నాడు.  

అయితే టిసిఎస్ సంస్థ అతని మాటలను ఖండిస్తోంది.  అతనికెప్పుడూ ఉద్యోగమిస్తామని చెప్పలేదని, అతనే ఊరికే ఉద్యోగులను వేధిస్తున్నాడని, అందువలన చూస్తాంలే, ప్రస్తుతానికి ఖాళీలు లేవు కానీ తగ్గ ఉద్యోగం ఖాళీ అయినప్పుడు అతని అప్లికేషన్ ని పరిగణనలోకి తీసుకుంటాంలెమ్మని చెప్పామన్నారు కంపెనీ అధికారులు.  

మే 3 న, తనకి మేనేజర్ ఉద్యోగం ఇవ్వమని, అందుకు 55000 పౌండ్లను జీతంగా ఇవ్వమని, అలాగే ఒక కమిటీని నియమించి ఇమిగ్రేషన్ నియమాలను ఉల్లంఘించకుండా చూడవలసివుందని సెగ్నర్ లేఖ రాసాడు.  దాన్నేమీ పట్టించుకోలేదు కానీ మే 18 న రాసిన లేఖలో, కంపెనీ డేటా నాదగ్గరుంది అని చెప్తున్న అతని ప్రకటన కంపెనీని ఆలోచింపజేసాయి.  తన దగ్గర టిసిఎస్ సంస్థలోని ఉద్యోగుల జాబితా పూర్తిగా ఉందని, కేవలం శాంపుల్ గా కొందరి వివరాలను మాత్రమే రిఫర్ చేసానని, యుకె లో పనిచేసే 1023 ఉద్యోగుల వివరాలు తన దగ్గరున్నాయని సెగ్నర్ చెప్పటం తో టిసిఎస్ సంస్థ దిగ్భ్రాంతి చెందింది.  

కాన్ఫిడెన్షియల్ డేటా ను సెగ్నర్ దొరికించుకున్నాడని తెలుసుకున్న టిసిఎస్ సంస్థ మధ్యవర్తిగా లాయర్ ని అతని దగ్గరకు పంపగా అతను మాట్లాడటానికి నిరాకరించాడు. దానితో జూన్ 2 న కంపెనీ హైకోర్టుకి వెళ్లి, తమ డేటాను దొంగిలించి దాని ఆధారంగా తమని బ్లాక్ మెయిల్ చెయ్యటానికి చూస్తున్నాడని ఆరోపించింది.  

కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు, దొంగిలించిన టాటా కంపెనీ డేటా సెగ్నర్ ఆధీనంలో ఉందని, అతను దాన్ని ఉపయోగించటానికి కూడా చూసాడన్న విషయాన్ని కోర్టు అంగీకరిస్తోందని, ఆ డేటాను అతను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న టిసిఎస్ భయాన్ని గుర్తించామని కూడా ప్రకటించింది.  

ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలలో టిసిఎస్ లో 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  సెగ్నర్ దగ్గరున్న డేటా చాలా విలువైనదని, అది పోటీ సంస్థల చేతిలో పడటం అంచనా కట్టలేనంత నష్టాన్ని కలిగిస్తుందని టాటా తరఫు లాయర్ కోర్టులో చెప్పారు.  

నేరం జరిగిందని ఈ కేసులో కోర్టు భావిస్తున్నా, కంపెనీ చూపిస్తున్న వివక్షను కారణంగా చూపిస్తూ  సెగ్నర్ బిర్మింగ్హమ్ కౌంటీలో వేసిన కేసు వలన టాటా కన్సల్టెన్సీ పూర్తిగా ఇందులోంచి బయటపడ్డట్టు అవలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles