4300 old painting found near giza pyramid

4300 old painting found near giza pyramid, paintings found recently in an egypt tomb, tomb of egypt priest persaneb with paintings, priest persaneb tomb hosts hidden paintings

4300 old painting found near Giza pyramid in an Egypt tomb purportedly of a priest called Persaneb

4300 సంవత్సరాల పురాతన పెయింటింగ్

Posted: 07/17/2014 03:25 PM IST
4300 old painting found near giza pyramid

ఈజిప్ట్ గిజాలోని గ్రేట్ పిరమిడ్ కి సమీపంలో లభించిన 4300 సంవత్సరాల క్రితం వేసిన చిత్రంగా పురావస్తుశాఖవారు నిర్ణయించారు.  

ఇప్పుడు మన సినిమాల సిడిలు, ఇంటర్నెట్ లో లభించే వివిధ సమాచారంతో భావి తరాలు ఈ తరం జీవన శైలిని అర్థం చేసుకోవచ్చు.  అలాగే పూర్వకాలంలోని చిత్రాలను చూస్తే వారు ఏ విధంగా జీవించేవారన్న విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు.  కుండలు ఉపయోగించారా పాత్రలను ఉపయోగించారా, గుర్రాలను గాడిదలను వాడారా ఇత్యాది వివరాలను ఆ చిత్రాలు తెలియజేస్తాయి.

ఒకప్పుడు టివిలకు రిమోట్ కంట్రోల్ ఉండేది కాదట.  టివి దగ్గరికెళ్ళి ఛానెల్ మార్చటం, సౌండ్ ని అడ్జస్ట్ చెయ్యటం చెయ్యాల్సివచ్చేదట అని ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్న కార్టూన్ వచ్చిన సమయంలో ఇంకా అప్పటికి రిమోట్ కంట్రోల్ అన్నిచోట్లా రాలేదు.  ఇలాంటివి చూస్తే భావి తరాలకు మన గురించి అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.  అజంత ఎల్లోరాలలోని గుహల్లోని చిత్రాలు, మొహెంజొదారోలో లభించిన వస్తువులు, చిత్రాల వలన అప్పటి నాగరికతను అర్థం చేసుకోగలిగాము.  

painting found near Giza pyramid 2

కీర్తిగడించిన పెద్ద మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళకి మామూలుగా అందరిలా సమాధి కట్టటమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళ స్థాయికి అనుగుణంగా పెద్ద పెద్ద గోపురాలు (tomb) నిర్మించి అందులో సమాధులను కట్టటం ఆచారంగా వస్తున్న ఈజిప్ట్ లో ఘనకీర్తి గడించిన రాజుల శవాలను మమ్మీలుగా పిరమిడ్స్ లో భద్రపరచేవారు.  అటువంటి పిరమిడ్స్ లో అతి పెద్దదైన గిజా గ్రేట్ పిరమిడ్ కి సమీపంలో ఉన్న సమాధిగోపురం లో కళాఖండాలు ఈమధ్యనే వెలుగులోకి వచ్చాయి.  ఆ సమాధిగోపురం ఒక మతాధికారిది.  ఆయన పేరు పెర్సనేబ్.  19వ శతాబ్దంలో బయటపడ్డ ఆ గోపురం అప్పటినుంచి అందరికీ తెలిసిందే కానీ అందులో లభించిన పెయింటింగ్స్ మాత్రం ఇన్నాళ్ళూ మరుగునపడివున్నాయి.  శిథిలాల కింద పడివున్న ఈ కళాఖండాలు వాతావరణ ప్రధూషణంతో దుమ్మూ ధూళితో నిండిపోయి 30 శాతం మిగిలి ఉన్నాయి.  
4300 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లోని జీవనవిధానాన్ని ఈ చిత్రాలు చూపిస్తున్నాయి.  గోపురాన్ని క్రీస్తు పూర్వం 2450 నుంచి 2350 మధ్య ప్రాంతంలో నిర్మించారని అంచనా.  అందులో హాల్లో తూర్పు వైపు గోడ మీద ఈ పెయింటింగ్స్ కనిపించాయి.  30 శాతం మిగిలివున్న చిత్రాల సాయంతో సంకేతాత్మకంగా మిగిలిన భాగాన్ని పూర్తిచేసే పనిలోపడ్డారు.

painting found near Giza pyramid 3

పెయింటింగ్ లో పై భాగంలో నైలు నదిలో ఓడలు దక్షిణదిశగా ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నాయి.  అంటే ఉత్తర ప్రాంతంలోని ఒక శక్తివంతుడైన వీరుడు ప్రయాణం చేస్తున్నట్లుగా సంకేతాన్నిస్తున్నాయి.  పెయింటింగ్ లో వ్యవసాయం చేస్తున్న దృశ్యాలలో దున్నటం, విత్తనాలు వెయ్యటం కనిపిస్తోంది.  ఒక పక్క పెర్సనేబ్ తన భార్యతోనూ, బహుశా కుక్క అయ్యుండవచ్చు ఆ జంతువుతోనూ చిత్రపటంలో కనిపిస్తున్నాడు.  మరో పక్క బోటులో ఒక వ్యక్తి పక్షులను వేటాడుతూ కనిపిస్తున్నాడు.  పెర్సనేబ్ స్థాయి, హోదాలేమిటో తెలియవు కానీ పెయింటింగ్ లో అతను పూజారిగాను, మరొకతను అతని సేవకుడిగాను రాసివుంది.  

సమాధిగోపురంలో మూడు భాగాలున్నాయి.  పూజగది, మధ్య హాలు, సమాధి.  సామాన్యంగా కీర్తివంతులకే సమాధిగోపురాలుంటాయి కాబట్టి పెర్సనేబ్ ఆ కాలంలో గొప్ప వ్యక్తైవుంటాడు.  ఎందుకంటే అందులో విగ్రహాలు కూడా పెట్టి ఉన్నాయి.  11 విగ్రహాల్లో పెర్సనేబ్, అతని కుటుంబ సభ్యుల విగ్రహాలున్నాయి. పుస్తకాల రూపంలోనే కాకుండా చరిత్ర ఆ కాలంలో విగ్రహాలు, కళాకృతుల రూపంలో ఉండేవి.  ఇప్పుడు డేటాను డిజిటల్ ఫాం లో పెట్టగలుగుతున్నాం కాబట్టి భావితరాలకు మన చరిత్ర డిజిటల్ రూపంలో లభిస్తుంది- అప్పడు వాళ్ళు వాడేవి ఏముంటాయో తెలియదు కానీ!

-శ్రీజ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles