Kcr met prime minister narendra modi in delhli tour

kcr, telangana cm kcr, kcr latest news, kcr delhi tour, kcr with narendra modi, narendra modi kcr, kcr met narendra modi, narendra modi kcr news, mp vinod, samagra kutumba survey

kcr met prime minister narendra modi and presented some requests to complete immediately

ప్రధాని మోడీ ముందు కేసీఆర్ పెట్టిన సవాళ్లు!

Posted: 09/06/2014 05:36 PM IST
Kcr met prime minister narendra modi in delhli tour

(Image source from: kcr met prime minister narendra modi in delhli tour)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయన మోడీకి కొన్ని సవాళ్లు విసిరారు. అయితే ఇక్కడ సవాళ్లు అంటే ఛాలెంజ్ కాదులెండి.. తమకు కావాల్సిన పథకాలను ఆయన ముందు పెట్టి వాటిని సవాళ్లుగా తీసుకుని పూర్తి చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం! తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అందుకు కావాల్సిన ముఖ్యమైన పథకాలను కేసీఆర్, మోడీ ముందు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఆ కొరతలన్నింటినీ తక్షణమే తీర్చాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

ప్రధానీ మోడీతో భేటీ అయిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో వారి మధ్య జరిగిన సమావేశ విషయాల గురించి విశదీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో వున్న ప్రజలు సఖ్యతగా వుండేలా తగిన ప్రణాళికలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. దాదాపు 21 ప్రతిపాదనలను ఆయన మోడీ ముందు వుంచినట్లు వివరించారు. అలాగే ప్రపంచ మేయర్ల సదస్సుకు హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోడీ ముందు కేసీఆర్ వుంచి ముఖ్యమైన పథకాలు :

1. తెలంగాణలో విద్యుత్‌ కొరతను పరిష్కరించాలి.
2. వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు.
3. ప్రత్యేక హైకోర్టు కావాలి.
4. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు.
5. హైదరాబాద్-వరంగల్‌-నాగ్‌పూర్‌ ఇండస్ట్రియల్ కారిడార్‌.
6. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.
7. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
8. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు
9. నార్త్‌ తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు మంజూరు చేయాలి.

ఈ విధంగా సదరు పథకాలను కేసీఆర్ తెలిపిన అనంతరం మోడీ.. ఎన్టిపిసి విద్యుత్ ప్రాజెక్టు, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌, హార్టికల్చర్‌ యూనివర్శటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణాలో నిర్వహించిన సమగ్ర సర్వే గురించి కేసీఆర్, మోడీకి వివరించినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. వీలైతే దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేను చేపట్టాలని ప్రధానికి విన్నవించినట్లు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  narendra modi  mp vinod  samagra kutumba survey  schemes  

Other Articles