Telangana government announces 10crores to bathukamma celebrations

kcr, telangana cm kcr, k. chandrashekar rao, telangana, telangana government, bathukamma, bathukamma celebrations, tankbund bathukamma, dasara, dusshera, latestnews, telugu festivals, telangana festivals, dasara special, districts, ministers, collectors

telangana government recognises bathukammma as state festival and announces rs10 crores for celebrations : telangana government orders every district collector to celebrate bathukamma grandly with rs.10lahks for each districts

బతుకమ్మ కోసం డబ్బులు పంచుతున్న ప్రభుత్వం

Posted: 09/14/2014 09:42 AM IST
Telangana government announces 10crores to bathukamma celebrations

బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయింది. ఉత్సవాన్ని ఇప్పటికే రాష్ర్ట పండగగా గుర్తించిన ప్రభుత్వం.., 9రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించింది. పండగ కోసం ప్రత్యేకంగా పది కోట్ల రూపాయలను కేటాయస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లకు బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు కేటాయించింది. అదనంగా అవసరం అనుకున్నా డబ్బులు ఇస్తామని తెలిపింది.

బతుకమ్మ పండగ సందర్బంగా అమ్మవారిని నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు ఇతర ప్రదేశాలను అలంకరించటంతో పాటు, శుభ్రత, లైటింగ్, ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం గ్రామస్థాయి అధికారులతో కూడా చర్చలు జరపాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రతి  పట్టణం, నగరాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మ సంబరాలపై బెలూన్లు ఏర్పాటు చేయమని  చెప్పింది. అంతేకాకుండా ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభ చూపే మహిళలకు బహుమతులు అందించాలని ప్రత్యేకంగా ఆదేశించింది. ప్రతి జిల్లా  నుంచి యాబై మంది వరకు మహిళలను ఎంపిక చేసి వారిని ట్యాంక్ బండ్ పై నిర్వహించే సద్దుల బతుకమ్మకు పంపించాలని చెప్పింది.

సోనియా, సుష్మా, మీరా రావాలి

ఇక తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళాప్రముఖులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ  ఏర్పాటు కోసం బిల్లు పెట్టిన సోనియా గాంధీతో పాటు రాష్ర్ట ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ చూపిన సుష్మా స్వరాజ్..  పార్లమెంటులో బిల్లు ఆమోదంకు కృషి చేసిన నాటి స్పీకర్ మీరా కుమార్ ను ఉత్సవాలకు హాజరుకావాలని  ఆహ్వానాలు పంపింది. వీరితో పాటు విభజనకు జాతీయస్థాయిలో తొలిసారి మద్దతు తెలిపిన బీఎస్పీ  అధినేత్రి మాయావతిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  bathukamma  festivals  latest news  

Other Articles