All parties in maharashtra competing seperately assembly elections

maharashtra assembly elections, bjp party, shiv sena party news, congress party news, ncp party news, maharashtra politics, maharashtra state news, narendra modi, election commission

all parties in maharashtra competing seperately assembly elections

25ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది!

Posted: 10/03/2014 03:35 PM IST
All parties in maharashtra competing seperately assembly elections

అప్పుడప్పుడు చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు మళ్లీ రిపీట్ అవుతుంటాయి. సాధారణంగా ఇటువంటి సంఘటనలు సినిమాల్లో చాలానే కనిపిస్తాయి కానీ.. ఈసారి మాత్రం నిజజీవితంలోనూ కనువిందు చేయనుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన కొన్ని మార్పుల వల్లే ఇలా మళ్లీ పాతికేళ్ల క్రితం చోటు చేసుకున్న ఒక అరుదైన సన్నివేశాన్ని మళ్లీ చూడబోతున్నాం! అదేమిటో తెలుసుకోవాలనుకుంటే.. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!

సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే 1989లో మహారాష్ట్రలో రాజకీయ పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే అప్పట్లో కొన్ని పార్టీలు ప్రజాసేవ పేరిట పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక అప్పటినుంచి అలాగే కొనసాగిన ఆ పార్టీల మధ్య అనుకోకుండా కొన్ని సీట్ల లెక్కింపు విషయంలో తగాదాలు రావడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రత్యేకంగా తమ మరాఠా జెండా పాతేందుకు పార్టీలన్నీ ఒంటరిగా పోరాటం చేయడానికి బరిలోకి దిగుతున్నాయి.

బిజేపీ-శివసేన 1989 నుంచి మిత్ర పక్షాలుగా మహారాష్ట్రలో కొనసాగిన విషయం తెలిసిందే! అయితే సీట్ల లెక్కింపు విషయంలో ఇద్దరి మధ్య కొన్ని అవాంతరాలు చోటు చేసుకున్నాయి. సీట్ల పంపకాల్లో వచ్చిన తేడా కారణంగా సుదీర్ఘ ప్రయాణానికి రెండు పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టాయి. అలాగే 1999 నుంచి కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ కూడా విడిపోయాయి. దీంతో సరిగ్గా పాతికేళ్ల తరువాత 2014లో నాలుగు పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. దీంతో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరు గెలవబోతారా..? అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles