Hudhud loss big hurdle to recover andhrapradesh

hudhud cyclone effect, hudhud cyclone loss, hudhud cyclone in andhrapradesh, andhrapradesh capital latest updates, chandrababu naidu on hudhud, vishakapatnam after hudhud cyclone, narendra modi on hudhud, hudhud rescue relief operations, latest telugu updates

hudhud cyclone loss hurdle for andhrapradesh : hudhud cyclone resulted massive loss to andhrapradesh its now a hurdle to renovate the state lets see how chandrababu will rebuilt ap

రాష్ర్ట పునరుద్దరణ సవాల్.. రాజధాని నిర్మాణం సమస్య..

Posted: 10/15/2014 06:47 PM IST
Hudhud loss big hurdle to recover andhrapradesh

ఏపికి దెబ్బమీద దెబ్బ పడుతుంది. విభజనతో అప్పుల రాష్ర్టంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పధంలోకి తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తుంది. రాజధాని నిర్మాణం, భూ సేకరణ విపక్షాల విమర్శలు ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ఈ లోగా తుఫాను ముప్పు వచ్చి పడింది. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లుగా.., విభజన సమస్యలతో సతమతం అవుతున్న ఏపీకి కొత్త సవాళ్లను విసిరింది హుద్ హుద్. తుఫానుతో విశాఖ సహా ఉత్తరాంధ్రలో విధ్వంసం జరిగింది. ఇక కోస్తాంధ్ర వ్యవసాయ రంగం కుప్పకూలింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపికి అప్పులు మిగిలాయి. ఈ సమయంలో అధికారం చేపట్టిన చంద్రబాబు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతూ ఇబ్బందులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధానికి కేంద్రమే డబ్బులు ఇస్తున్నా... స్థల సేకరణ, ప్రాంతం ఎంపిక వివాదాస్పదం అవుతోంది. వీటిని పరిష్కరించేందుకు అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నారు. రాజధానితో పాటు రాష్ర్టాభివృద్ధి ఏపికి ప్రధాన సమస్యగా ఉండేది. రాజధానిపై ప్రకటన జరిగినా.., స్పష్టత లేకపోవటంతో కంపనీలు ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. క్యాపిటల్ సిటి నిర్మాణం జరిగితేనే కంపనీలు వచ్చే అవకాశం ఉంది.

రాజధాని సమస్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే.., వచ్చిపడింది హుద్ హుద్ తుఫాను. ఉత్తరాంధ్రను ఊడ్చేసినట్లుగా చేసి.., కోస్తాంధ్రకు కన్నీళ్ళను మిగిల్చింది. మొత్తంగా రాష్ర్టానికి ఇప్పట్లో కోలుకోలేని నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. తుఫాను వల్ల అన్ని విభాగాలకు కలిపి జరిగిన నష్టం రూ. 70వేల కోట్లుగా రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రధాని రూ.1000కోట్లు తక్షణ సాయం ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. ఇది మహా అయితే మరో వెయ్యి కోట్లు లేదా కాస్త ఎక్కువ ఉండవచ్చు. అంతేకాని నష్టంలో కనీసం పదోవంతు ఉంటుంది అని కూడా ఆశించలేము.

కేంద్రం సాయం..., వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రముఖులుఇలా అంతా కలిపి చేసినా రూ.10వేల కోట్లు కూడా సహాయం లభించదు. ఈ తరుణంలో అంత భారీ మొత్తంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి ఎవరు ముందుకు వస్తారు. ఏపీ ప్రభుత్వం ఎలా పునరుద్దరణ చర్యలు చేపడుతుంది అనేది సవాల్ గా మారింది. ఉత్తరాంధ్రలో ఎటు చూసినా విషాదమే మిగిలింది. అందాలనగరం విశాఖ కనీసం కరెంటు లేకుండా అంధకారంలో మగ్గుతోంది. తుఫాను ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చేసిన కృషి హర్షించదగినది. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఉపద్రవం ఒక ఉప్పెనలా వచ్చి పోయింది అని చెప్పుకుంటున్నారు. అయితే త్వరగా కోలుకోలేకుండా వచ్చిన విపత్తు నుంచి ఏపి ఎలా బయటపడుతుంది.., బాబు ఏం చేస్తారు అని అంతా ఎదురుచూస్తున్నారు. రాజకీయ చాణిక్యుడుగా పేరు పొందిన చంద్రబాబు.., రాజధానిని, రాష్ర్టాన్ని ఎలా నిర్మిస్తాడో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hudhud  andhrapradesh  vishakapatnam  latest updates  

Other Articles