Kashmir flood reunites kidnapped child with her family

Kashmir, Flood, Kidnapped, Child, Family,

Kashmir Flood Reunites Kidnapped Child With Her Family

వరదలు ఆ అమ్మాయి పాలిట వరంగా మారాయి..

Posted: 10/16/2014 09:15 PM IST
Kashmir flood reunites kidnapped child with her family

ప్రకృతి ప్రకోపం అందరికి శాఫంగా పరిణమిస్తేంటే ఆ అమ్మాయికి మాత్రం అదే వరంగా మారింది. జమ్మూకాశ్మీర్  ఇటీవల సంభవించిన వరదలు అక్కడి ప్రజలకు తీవ్ర ఆస్తినష్టం, ప్రాణనష్టం కలిగించాయి. ఎందరినో అయినవారికి దూరం చేసి అనాథలనూ చేశాయి. కానీ ఆరేళ్ల చిన్నారి మేఘకు మాత్రం ఈ వరదలే వరమయ్యాయి. ఏడాదిక్రితం అపహరణకు గురైన ఆమెను తిరిగి అమ్మఒడికి చేర్చాయి.

ముంబయిలోని బాంద్రాలో నివసించే మేఘ ఏడాదిక్రితం అపహరణకు గురైంది. తనను నజీర్ అహ్మద్ అనే వ్యక్తి అపహరించుకు వెళ్లి యూపీ, కోల్‌కతా, కాశ్మీర్‌లలో తిప్పాడని, రోజూ కొట్టి భిక్షాటన చేయించేవాడని మేఘ పేర్కొంటోంది. వరదలు రావడంతో ఆమెను దాల్ గేట్ వద్ద వదిలి నజీర్ అహ్మద్ ఎటో వెళ్లిపోయాడు. ఒంటరిగా, దిగాలుగా ఉన్న పాపను చూసిన స్థానికులు వరదల కారణంగా కుటుంబం నుంచి విడిపోయిందనుకున్నారు. స్థానిక ఇమామ్ పోలీసుల వద్ద పాప వివరాలు నమోదు చేయించి పాప సంరక్షణ బాధ్యతను ఓ కుటుంబానికి అప్పగించారు.

మేఘ తన కథ అంతా ఆయనకు చెప్పడంతో ఆమె ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. అంతే కొద్ది రోజుల్లోనే లింకు దొరికింది. మేఘ తల్లిదండ్రులు ఏడాది క్రితం ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఈ పాప వివరాలతో సరిపోలడంతో పోలీసులు మేఘ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మేఘ తాతయ్య శ్రీనగర్ వచ్చి ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాడు. అలా వరదల కారణంగా చిన్నారి మేఘ తిరిగి అమ్మఒడికి చేరుకోగలిగింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir  Flood  Kidnapped  Child  Family  

Other Articles