ఆసియా క్రీడల సెమీఫైనల్స్లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన భారత బాక్సర్ సరితాదేవిపై ఏఐబీఏ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. తనకు బాక్సింగ్ బౌట్ లో అన్యాయం జరిగిందని గొంతు చిక్కుకుని అరిచినా.. వెక్కి వెక్కి ఏడ్చినా అలకించిన ఆల్ ఇండియా బాక్సింగ్ అసోసియేషన్.. క్రమశిక్షణ చర్యలను మాత్రం తీసుకుంది. రిఫరీలు తనకు అన్యాయం చేశారని, తాను గెలిచినా ఓడినట్లు ప్రకటించారని వెలుగెత్తి చాటిన సరితా దేవిని ఏఐబీఏ సస్సెండ్ చేసింది. వేదికపై నిరసన వ్యక్తం చేయడం, కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసిన ఘటనకు సంబంధించి సరితాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు పరకటించింది.
సెమీఫైనల్ లో మూడవ స్థానంలో నిలచి కాంస్య పతాకాన్ని సాధించిన సరిత అదే వేదికపై రజత పతక విజేతకు పతకాన్నిఅందించి అధికారులకు, ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి సరిత దేవికి సానుభూతి వెల్లివిరిసింది. వెల్ డన్ బాక్సర్ సరితా.. వీ ఆర్ విత్ యూ అంటూ భారతీయులు ముక్త కంఠంతో నినదించారు. ఈ ఘటనపై వేడి చల్లారిన తరువాత భారత్ బాక్సింగ్ అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించింది.
సెమీఫైనల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు మ్యాచ్ లోని న్యాయనిర్ణేతలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి సెమీస్ బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చింది. అయినా కూడా జీనాపార్క్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. కాంస్య పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజత పతకం విజేత జీనా పార్క్కే ఇచ్చేసింది. .ఒకటిన్నర సంవత్సరాల బాబును కూడా తాను వదిలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనను గుర్తుపట్టలేదని సరితాదేవి వాపోయింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉన్నందునే ఇలా జరిగిందని అరోపించిన నేపథ్యంలో ఏఐబీఏ అమెను సస్సెండ్ చేసింది.
తనకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చాటితే కూడా తప్పానా..? అంటూ సరితా దేవి తరపున బాక్సింగ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆసియా గేమ్స్ లో సరితాదేవికి అండగా నిలవాల్సిందిపోయి.. అమె పైనే చర్యలకు ఉపక్రమించడం దారుణమని మండిపడుతున్నారు. భారత్ లో ఎందరో క్రీడాకారులు అత్యద్భవ ప్రతిభాపాటవాలతో వున్నా వారికి శిక్షణ నిచ్చి.. తీర్చదిద్దడంలో ఆయా సంఘాలు విఫలం అవుతున్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో నైపుణ్యం గల క్రీడాకురులకు అండగా నిలవడంలో కూడా జంకుతున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. క్రీడాకారుల ప్రతిష్టను దిగజార్చేలా సంఘాలు వ్యవహరిస్తే.. జాతీయ క్రీడాపాటవానికే ప్రమాదం ఒనగూరే ముప్పు వుందని క్రీడాభిమానులు అంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more