హుధుద్ తుఫాను ధాటికి విశాఖపట్నం సహా ఉత్తర కోస్తా జిల్లాలు అతలాకుతలం కావడంతో తదనంతర సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికార యంత్రాగం, తమ ఇళ్లను పరిశుభ్రంగ మలుచుకోవడంలో స్థానిక ప్రజానికం నిమగ్నం అయ్యారు. ఇఫ్పుడిప్పుడూ వారు తుఫాను సృష్టించిన బీభత్సం గురించి చర్చించుకుంటున్నారు. తుఫాను వల్ల తమ ఇళ్లలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సముద్ర వీక్షణం కలిగిన అపార్టుమెంట్ వాసులు తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో ఆ బీభత్సాన్ని కిటీనీ నుంచి వీక్షించారట.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ ఆదేశాలతో అక్కడ యంత్రాంగం ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపిేసింది. దీంతో కరెంటు లేక, టీవీలు చూడలేక కిటీకీల గుండా సముద్రాన్ని చూస్తు వుండిపోయారట ఆ అపార్టుమెంటు వాసులు. ఇంతలో సముద్రంలో రెండు నౌకలు మునిగిపోయే దృశ్యాన్ని వారు చూశారట. అయితే వారు నిజంగా చూశారా లేదా అనే విషయాన్ని పక్కన బెడితే.. తుపాను ధాటికి రెండు నౌకలు మాత్రం సముద్రంలో మునిగాయన్నది మాత్రం వాస్తవమని అధికారులే చెబుతున్నారు.
సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సాగర్ పర్చిమి నౌకతో సహా. మరొకటి షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డీఎం సింగ్. నౌకలు సముద్ర గర్భంలోకి జారుకున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి నౌకకన్నా చిన్నపరిణామంలో, పడవ కన్నా పెద్దవైనవిగాను వున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు.. హుధుద్ తీరాన్ని తాకే సమయానికి ఫిషింగ్ హార్బర్లో ఉన్నాయని, అందుచేతనే అవి మునిగిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more