Japan will burnt after 100 years with volcanoes

japan earthquake, earthquake in japan, heavy earthquakes, valcanoes in india, valcanoes in the world, world dangerous valcanoes, valcanoes in japan, valcanoes burnt, latest news, japan latest news, japan history, japan technology

japan will burnt after 100 years with volcanoes : technology brand countrey japan life comes to end by next 100years. after 100days 95percent of japan will burnt with valcanoes fire. a survey says that in 100years valcanoes heavy blast will cause to death 127millions of people in japan

వందేళ్ళ తర్వాత జపాన్ కాలిపోవటం ఖాయం

Posted: 10/27/2014 03:25 PM IST
Japan will burnt after 100 years with volcanoes


ప్రకృతి శాసనాలను ఎవరూ ఆపలేరు అని చాలాసార్లు నిరూపితం అయింది. ఎంతగా అభివృద్ధి చెందినా.., ప్రకృతి చేసే దాడుల నుంచి తప్పించుకోవటం తప్ప.. వాటిని అడ్డుకోవటం జరగటం లేదు. టెక్నాలజి దిగ్గజంగా పేరొందిన జపాన్ కు సమీప భవిష్యత్తులో ఊహించలేని ముప్పు పొంచి ఉంది. మరో వందేళ్ళలో జపాన్ సర్వ నాశనం కావటం ఖాయమని ప్రముఖ శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. అగ్నిపర్వతాలు భారీగా విస్పోటనం చెంది దేశమంతా తుడిచిపెట్టుకుపోతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోబె యునివర్సిటీ శాస్ర్తవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయింది. వందేళ్ళ తర్వాత బద్దలయ్యే అగ్నిపర్వతాలు జపాన్ లోని 95శాతం భూభాగాన్ని చిదిమేస్తాయని చెప్తున్నారు. దీనివల్ల దేశంలోని 127మిలియన్ల జనాభా తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నారు. భారీగా లావా విరజిమ్మి.., ప్రజలను బలితీసుకుంటుందన్నారు. గత 1.2లక్ష్ల సంవత్సరాల్లో ఏడుసార్లు ఇలాంటి పేలుళ్లు సంభవించాయని మరోసారి ఇలాంటి విపత్తు రావటం ఖాయమంటున్నారు.

అయితే ఇలాంటి విపత్తులు వచ్చే ప్రమాదం ఒక్కశాతమే ఉందని ప్రొఫెసర్లు యోషియుకి, సుజుకి చెప్తున్నారు. అలాగని ఈ హచ్చరికలను తేలికగా తీసుకోలేము. ఎందుకంటే వచ్చే 30ఏళ్ళలో జపాన్ లో భారీ భూకంపం వస్తుందని 1995లో హెచ్చరించారు. అలా జరిగిన తర్వాతి రోజునే భారీ భూకంపం వచ్చి 6400 బలయ్యారు. కాబట్టి ఈ హెచ్చరికను కూడా తేలికగా తీసుకోవద్దు అని స్పష్టం అవుతోంది. ఏదేమైనా ఇలాంటి విపత్తు రాకూడదు అనే అంతా కోరుకుందాం. సర్వేజనా సుఖినోభవంతు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  valcano  earthquake  latest news  

Other Articles