Opposition rejects minister niranjan jyoti s apology demands resignation

Union Minister, Niranjan Jyoti, Sadhvi Niranjan Jyoti, Prime minister, Narendra Modi, Ram rajya, Lok Sabha, Rajya Sabha, Parliament, Congress, Delhi, Ramzadon, derogatory language

the minister Sadhvi Niranjan Jyoti apologised in both Houses, saying, "It was not my intention to offend anybody. I express regret from my heart and withdraw my words"; the same did not suffice opposition MPs.. they demanded resignation

రాజీనామా చేయిస్తారా..? బర్తరఫ్ చేస్తారా.? తేల్చండి..

Posted: 12/02/2014 02:53 PM IST
Opposition rejects minister niranjan jyoti s apology demands resignation

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తన పదవికి రాజీనామా చేయాలని పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో అమె క్షమాపణ చెప్పారు. ఎవరినీ నొప్పించాలన్నది తన అభిమతం కాదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిస్తే తానను క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను మనస్పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వీ నిరంజన్ జ్యోతి 'రామరాజ్యం వైపు ఉంటారా? లేక అసాంఘిక శక్తుల వైపు ఉంటారా..? ఎటువైపుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మంత్రి నిరంజన జ్యోతి వ్యాఖ్యల వివాదాన్ని.. ఇవాళ కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో లేవనెత్తారు. సభ ప్రారంభమవ్వగానే వారు మంత్రి వ్యాఖ్యాలపై నిరసన తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే రీతిలో ఉన్నాయని మంత్రి సభకు క్షమాపణలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సభలో గంధరగోళం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను రెండు పర్యాయాలు పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

అటు రాజ్యసభలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఈ విషయమై మాట్లాడుతూ.. మంత్రులు అసభ్యపదజాలాన్ని వాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తాము ఆందోళనకు గురయితే ప్రధాని సభ్యకు ఎందుకు హాజరుకాలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో ఆమెను క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని సమాజ్ వాదీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రధాని సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నిరసనలనలు పెల్లుబిక్కడంతో.. బీజేపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వం చర్చకు సిద్దంగా వుందన్నారు. విపక్షాలు నోటీసు ఇస్తే అ అంశంపై చర్చకు సిద్దమన్నారు. అసభ్య పదజాలాన్ని వాడకూడదని తమకు తెలుసునని, అయితే ఇది అధికార పక్షంతో పాటు విపక్షాలకు కూడా వర్తిస్తుందన్నారు.

కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యాల నేపథ్యంలో ప్రధాని మోడీ తన మంత్రి వర్గ సహచరులకు హెచ్చరికలు చేశారు. మంత్రులు వారి విజ్ఞతను మరచి ఎక్కడ ప్రవర్తించవద్దని, అసభ్య పదజాలాన్ని కూడా ఎక్కడా వినియోగించరవద్దని సూచించారు. పార్టీపై ఈ వ్యాఖ్యాల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఇకపైన తన మంత్రివర్గంలో ఎవరు అసభ్యపదజాలన్ని వినియోగించినా తాను సహించనని తేల్చిచెప్పారు. మరోవైపు ఇచ్చిన  హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. మొత్తం 25 అంశాలపై మోదీ ప్రభుత్వం వెనకడుగువేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.  లోక్‌సభ సమావేశం ప్రారంభానికి కాంగ్రెస్‌ ఎంపీలంతా పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ఈ ధర్నాకు నాయకత్వం వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles