4 iit kanpur students turn down rs 1 crore per annum offers

IIT-Kanpur students, turn down crore-rupee salary, pursue higher studies, eight-figure salaries, IIT Kanpur placements, Rs 1 crore yearly, IIT-Kanpur placement cell chairman, Prof Deepu Philip, IIT kanpur

Considerations of professional fulfilment and a desire to pursue higher studies have trumped offers of eight-figure salaries during placements at IIT Kanpur as four students chose to turn down jobs which would have paid them more than Rs 1 crore yearly.

లక్ష్మీకాటాక్షాన్ని వద్దంటున్న సరస్వతీ పుత్రులు

Posted: 12/05/2014 05:01 PM IST
4 iit kanpur students turn down rs 1 crore per annum offers

వారందరూ సరస్వతీ దేవి కటాక్షాన్ని పోందారు. లక్ష్మీదేవి కటాక్షిస్తానంటే మాత్రం వద్దన్నారు. దేవతలే స్వయంగా బహుళజాతి సంస్థల రూపంలో వచ్చి ఏడాదికి కోటి రూపాయల మేర వేతనాన్ని ఇస్తామన్న అప్పుడే వద్దని నిరాకరించారు. ఇంతకీ ఎవరు వారనరేగా మీ ప్రశ్నం. వారంతా ఐఐటీ కాన్ఫూర్ లో చివరి ఏడాది అభ్యసిస్తున్న విద్యార్థులు. ఒకటి రెండు కాదు ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీని నిరాకరించారు. వారిలో ముగ్గురు విద్యార్థులతో పాటు ఒక విద్యార్థిని కూడా వుంది.

ప్రపంచ ఖ్యాతి గాంచిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం అంటే  ఎదురు డబ్బు చెల్లించి బాక్ డోర్ ఎంట్రీలు వున్నాయా అంటూ క్యూ కట్టే ఆశావహులు వేల సంఖ్యలో వున్న ఈ రోజుల్లో.. సంస్థలే మీరు నాకు నచ్చారు. కోటి రూపాయల ప్యాకేజీ ఇస్తామంటే ఒకరిద్దరు కాదు నలుగురు విద్యార్థులు నిరాకరించారు. ఇంకా చదువు పూర్తిగా కాకముందే ఏడాదికి కోటి రూపాయల వేతనమంటూ లక్ష్మీ దేవి తలుపు తడితే కాదనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ కాన్పూర్ ప్లేస్ మెంట్ సెల్ చైర్మన్ ఫ్రోఫెసర్ దీఫు ఫలిఫ్ తెలిపారు.

ఆ నలుగురు విద్యార్థులు ఎవరన్నది, వారి పేర్లను వెలువరించకుండా ఆయన వివరాలను వెల్లడించారు. తమ వ్యక్తిత్వానికి సరిపడని ఉద్యోగాల్లో కోటి రూపాయలు వచ్చినా చేయలేమని ఆ నలుగురిలో ఇద్దరు చెప్పారన్నారు. తమకు డబ్బుతోపాటు ఉద్యోగ సంతృప్తి కూడా చాలా ముఖ్యమేనని తేల్చి చెప్పారు. కోటి ఆఫర్‌ కాదనుకున్న వీరు ఏడాదికి 50 లక్షల రూపాయల వేతనమొచ్చే సంస్థలో ఉద్యోగం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరిలో ఒక మహిళా విద్యార్థి కూడా ఉండడం గమనార్హం. మరో ఇద్దరు మాత్రం తాము మరింత ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నామని ప్రస్తుతానికి ఏ ఉద్యోగం చేయాలనుకోవడంలేదని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles