Isis threatens of attacks in bangalore high alert declared

islamic state terrorists warnings, threatens of attacks in bangalore, high alert declared in bangalore, isis threatens to bangalore commissioner, isis threats of attacks in bangalore

isis threatens of attacks in bangalore high alert declared in avenge of isis twitter organiser biswas arrest

ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదుల హెచ్చరికలు..కట్టుదిట్టమైన భద్రత

Posted: 12/16/2014 07:40 AM IST
Isis threatens of attacks in bangalore high alert declared

తమ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న మెహదీ మస్రూర్ బిశ్వాస్ అరెస్టుతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయారు. మంగళవారం నాడు బెంగళూరులో భారీఎత్తున దాడులు చేస్తామంటూ ఏకంగా నగర పోలీసు కమిషనర్కే ఈమెయిల్ పంపారు. దాంతో నగర వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. ఐఎస్ఐఎస్ హెచ్చరికతో తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న మెహదీ మస్రూర్ బిశ్వాస్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు బెంగళూరు క్రైం డీసీపీ అభిషేక్ గోయల్ చెప్పారు. ట్విట్టర్లో షమీవిట్నెస్ అనే పేరుమీద ఉన్న ఖాతా గురించి పూర్తి వివరాలు కావాలన్నారు. విచారణలో ఇవి చాలా కీలకమని ఆయన తెలిపారు. ట్విట్టర్ సంస్థ కూడా తమ పట్ల సానుకూలంగానే స్పందించిందని అన్నారు. ఐఎస్ఐఎస్కు, బిశ్వాస్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  attacks on bangalore  high alert  bangalore commissioner  

Other Articles