Death toll in bodo militant attack rises to 50 assam cm gogoi directs forces to act against killers

arunachal pradesh, assam incident, assam attacks, assam terrorist attacks, assam terrorist bodo militants, assam recent incidents, naredra modi tweets

The attack incident site is located very near to the inter-state border between Assam and Arunachal pradesh

పిరికిపందల్ని హెచ్చరించిన ప్రధాని, ఖండించిన రాష్ట్రపతి

Posted: 12/24/2014 12:02 PM IST
Death toll in bodo militant attack rises to 50 assam cm gogoi directs forces to act against killers

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో 55 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారునమైనటువంటి సంఘటనను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి.

తీవ్రవాదుల ఘాతుకాన్ని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజల్ని చంపటం పిరికిపందల చర్య గా పేర్కొన్నారు. ఇది చాల హేయమైన చర్యని హెచ్చరించారు. తాను రాజ్ నాథ్ సింగ్ తో ఈ విషయం గురించి చర్చించానని, త్వరలో హోంమంత్రి అస్సాం లో పర్యటిస్తాడని, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తో కూడా మాట్లాడానని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. అస్సాం లో జరిగిన  ఈ ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని, అమాయక ప్రజలను చంపటం అన్యాయమని పేర్కొన్నారు.

హరి 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naredra modi tweet. assam attack incident  bodo militants  

Other Articles