Airasia malaysia indonesia flight qz8501 to singapore missing

air asia flight missing, malaysia flight missing, indonesia flight missing, malaysia flight flound in ocean, malaysia flight found, air asia malaysia recent incident, malaysia recent incident

AirAsia QZ8501 Missing flight is 3rd Malaysia-linked air incident

ఏమిటీ దురదృష్టం..? మలేషియా గగన విహారాలా? మరణ విహారాలా...?!

Posted: 12/29/2014 12:14 PM IST
Airasia malaysia indonesia flight qz8501 to singapore missing

మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్370 విమానం గల్లంతైన కొన్ని నెలలకే ఆదివారం నుండి మరొక విమానం గల్లంతయ్యింది. ఇంకా పలు దేశాల నావికా దళాలు, మలేషియా భద్రత సిబ్బంది విమాన ఆచూకి కోసం ప్రత్నిస్తునే ఉన్నారు. మలేషియాలోని కొన్ని వర్గాల కథనం ప్రకారం బెలితుంగ్ ద్వీపంలోని తాంజుంగ్ పాండన్, ఇండోనేసియాలోని కాళీమంతన్‌ల మధ్య గగనతలంలో విమానమున్నప్పుడు చివరిసారిగా దాని నుంచి సంకేతాలొచ్చాయన్నారు. విమానం అదృశ్యమై చాలా గంటలు గడవడంతో ప్రయాణికులంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎయిర్‌ఆసియా తక్కువ ధరలకే విమాన సేవలందిస్తూ చౌక రవాణ సేవలు అందిస్తున్న సంస్థ గా పేరుగాంచింది. ఎయిర్ ఆసియా గ్రూప్ సీఈఓగా భారత సంతతికి చెందిన టోనీ ఫెర్నాండెజ్ వ్యవహరిస్తున్నారు. ఇరుగుపొరుగు దేశాలకు విమాన సేవలందించేందుకు ఆయన పలు బడ్జెట్ విమానాలను ప్రారంభించారు. విమాన పైలట్‌గా ఉన్న కెప్టెన్ ఇరియాంతొకు 6,100 గంటల పైలటింగ్ అనుభవం ఉంది. ఈ ఘటన పట్ల మలేషియా ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. అదృశ్యమైన విమానంలోని ప్రయాణికుల కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.

మలేసియా విమానాలకు దురదృష్టం వెన్నాడుతుంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘ఎంహెచ్370’ విమానం గల్లంతైన కొన్ని నెలలకే ఈ ఎయిర్ ఆసియా మలేసియా విమానం ఆచూకీ లేకుండా పోయింది. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూడా దురదృష్టం కొద్ది మలేసియా విమానాన్నే నేలకూల్చారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడు ఘోర విమాన ప్రమాదాలను మలేసియా చవి చూసినట్లైంది. ఈ ఏడాది మార్చి లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతుండగా సింగపూర్‌కు కొన్ని వందల మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఎంహెచ్370 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది.

ఇప్పటిదాకా ఆ విమానం, అందులోని 239 మంది ప్రయాణికుల ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆ తర్వాత జూలై 17న ఆమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్ విమానం ‘ఎంహెచ్ 17’ను ఉక్రెయిన్ గగనతలంలో తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ ఘటనలో 300 మంది మృతిచెందారు. తాజాగా అదృశ్యమైన ‘ఎయిర్‌ఏసియా’ విమానంలోనూ 162 మంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి గతం పునరావృతం కాకూడదని ప్రతిఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విమాన ప్రమాదాలన్ని యాదృచ్చికమే అయినప్పటికీ మలేషియా ప్రజలను ప్రభుత్వాలను కలవరపుట్టిస్తూన్నాయన్నది వాస్తవం.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malaysia flight missing  air asia QZ8501  search operations  

Other Articles