Court says nsa will imposed for trying to build nathuram godse temple

Nathuram Godse, Nathuram Godse temple, Nathuram Godse latest, Nathuram Godse temple issue, court on Nathuram Godse, Nathuram Godse latest update, Nathuram Godse kills Mahatma Gandhi, Temple for Nathuram godse, India latest news, Latest Updates in India, Sitapur Court, Sitapur Court on Nathuram Godse Temple, NSA Act, National Security Act, Mahatma Gandhi death, Mahatma Gandhi assasination, Mahatma Gandhi latest photos

Court says NSA Will Imposed for trying to build Nathuram Godse temple : Sitapur District Administration said that National Security Act ( NSA) would imposed if any one tries to build temple for Nathuram Godse. Court and Constitution of India will not accept for building a temple to killer of National Father says Sitapur District Administration

ఆయన్ను హీరో చేస్తే చూస్తూ ఊరుకోము

Posted: 12/30/2014 08:28 AM IST
Court says nsa will imposed for trying to build nathuram godse temple

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేకు గుడి కట్టే ప్రయత్నాలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. గాడ్సేకు గుడి కడితే చూస్తూ ఊరుకోమని ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా కోర్టు హెచ్చరించింది. కేవలం సీతాపూర్ కోర్టు పరిధిలోనే కాదు.., దేశంలో ఎక్కడ గాడ్సేకు గుడి కట్టినా సహించము అని న్యాయమూర్తి పాండే హెచ్చరించారు. ఎవరైనా గుడి కట్టేందుకు ప్రయత్నిస్తే.., జాతీయ భద్రతా చట్టం (ఎన్.ఎస్.ఏ) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతిపితను చంపిన వ్యక్తికి గుడి కట్టడం ఏమిటని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల దేశంలో తీవ్రవాదం, హింస పురివిప్పే అవకాశం ఉందన్నారు.

2015 జనవరి 30న సీతాపూర్ జిల్లాలోని పారా గ్రామంలో గాడ్సేకు గుడి కడతానని కమలేష్ అనే వ్యక్తి గతంలో ప్రకటించాడు. ఇందుకోసం తనకున్న భూమిలో కొంత దానం చేశానని కూడా చెప్పాడు. ఈ నిర్ణయాన్ని కొందరు సమర్ధించగా.. ఇంకొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన కోర్టు కమలేష్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ మద్య గాడ్సేను కొన్ని సంఘాలు హీరోను చేస్తున్నాయంటూ మండిపడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కమలేష్ వెనక్కి తగ్గుతాడా.., తన సంకల్పాన్ని కొనసాగిస్తాడా తెలియాల్సి ఉంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nathuram Godse  NSA act  Mahatma Gandhi  

Other Articles