Isro s mangalyaan completes 100 days in martian orbit

Mars Orbiter Mission (MOM), MOM successfully completed 100 days, Indian Space Research Organisation's (ISRO's), ISROs MOM completed 100 days, MOMs 100 days on Red planet, 100 days of mangalyaan, 100 days of mangalyaan on mars,

Indian Space Research Organisation's (ISRO's) Mars Orbiter Mission (MOM) aka Mangalyaan, which had successfully entered the Martian orbit on September 24, 2014, has today completed 100 days around the Red planet.

దిగ్విజయంగా శత దినాన్ని పూర్తి చేసుకుని.. పరిశోధన చేస్తోంది.

Posted: 01/02/2015 03:41 PM IST
Isro s mangalyaan completes 100 days in martian orbit

భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించి నేటితో వంద రోజులు పూర్తయింది. మంగళ్ యాన్ అద్భుతంగా పనిచేస్తోందని, శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ మైలు రాయిని పురస్కరించుకొని అంతరిక్ష సంస్థ ఒక సదస్సును నిర్వహిస్తోంది. మామ్‌ను 2013 నవంబర్ 5న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఆసియాలోనే మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపిన దేశంగా మామ్ ద్వారా  ఇస్రో ఘనకీర్తిని ఆర్జించింది.

భారీ హాలివుడ్ చిత్రానికి ఖర్చు పెట్టేంత వ్యయంతో అంతరిక్షంలో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించిన మంగళ్ యాన్.. గత ఏడాది నవంబర్ 5 నుంచి విశ్వంలో 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి గత ఏడాది సెప్టెంబర్ 24న అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందులోని ఐదు సైన్స్ పరికరాలు అంగారకుడి వాతావరణం, అక్కడ ఒకప్పుడు పుష్కలంగా ప్రవహించిన నీటి చరిత్రతోపాటు జీవం ఉనికి వంటి అంశాలపై పరిశోధిస్తున్నాయి. ఈ ఉపగ్రహానికి అంగారకుడిని చుట్టి రావడానికి 72 గంటల 51 నిమిషాల 51 సెకన్లు పడుతోంది. మంగళయాన్ ఏడాది పాటు సేవలు అందించవచ్చని భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars Orbiter Mission (MOM)  ISRO  Mangalyan  

Other Articles