Shabir ali releases kcr promises list

Shabbir Ali on KCR, Shabbir Ali on kcr promises, Shabbir Ali latest updates, Shabbir Ali comments, Shabbir Ali on trs, kcr promises, kcr latest updates, kcr election promises, kcr latest updates, kcr comments, telangana updates, telangana latest

Shabir Ali releases kcr promises list : congress leader Shabbir Ali released KCR promises list and criticises Telangana Chief Minister. KCR given many promises but still any one is not completed.

చంద్రశేఖరా ఏంది నీ చిట్టా.. హామీల బుట్ట

Posted: 01/06/2015 11:51 AM IST
Shabir ali releases kcr promises list

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడకు వెళ్ళినా హామిలు గుప్పించటం అలవాటైపోయింది. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత సమస్యలన్నీ తీర్చటంతో పాటు, భారీ ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇలా చేసిన ప్రకటనలు అన్ని కలిపి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఓ జాబితా విడుదల చేశారు. వాటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే, ఇన్ని హామీలు చేశాడా చంద్రశేఖరుడు అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు ఆ హామీలు చూస్తే అసలు ఎలా సాధ్యమవుతాయి అని సందేహం కూడా కలుగుతుంది. ఇంతకీ ఆ హామీలేమిటో ఓ సారి చూద్దాం.

* హైదరాబాద్ ను సిలికాన్ వ్యాలి తరహాలో ఐటీ హబ్ గా మార్చటం.
* షాంఘై తరహాలో హార్డ్ వేర్ హబ్, టెక్నాలజీ డెవలప్ మెంట్ బ్యాంక్
* చంచల్ గూడ జైలు తరలింపు, హైదరాబాద్ రేస్ కోర్స్ తరలింపు
* మిలటరీ స్థావరాల తరలింపు, హుస్సేన్ సాగర్ శుద్దికి వంద కోట్లు
* వినాయక నిమజ్జనాల కోసం కొత్తగా వినాయక్ సాగర్ నిర్మాణం.
* హుస్సేన్ సాగర్ చుట్టూ భవనాల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, స్కై వాక్ లు
* హుస్సేన్ సాగర్ శుద్ధికి వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక చర్యలు
* హైదరాబాద్ శివారులో మరో విమానాశ్రయం నిర్మాణం
* రవీంధ్ర భారతి స్థానంలో కొత్త భవనం నిర్మాణం
* అదిలాబాద్ ున మరో కాశ్మిర్ గా రూపుదిద్దటం.
* యాదగిరి గుట్టను మరో వాటికన్ సిటిగా అభివృద్ధి చేయటం
* వరంగల్ ను సూరత్ లా టెక్స్ టైల్ హబ్ గా చేయటం
* కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ లా అభివృద్ధి చేయటం

ఇలా అనేక ప్రకటనలు చేస్తూ వచ్చాడు. కానీ వీటిలో ఏ ఒక్క హామి కూడా అమలుకు నోచుకోలేదు.., కనీసం ప్రారంభం కాలేదు. వీటిలో ఎన్ని హామీలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో, అందులో ఎన్ని పూర్తవుతాయో తెలియాల్సి ఉందన్నారు. ప్రకటనలు చేసుకుంటూ పోతున్న సీఎం, వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నారో ప్రజలకు వివరించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shabbir Ali  KCR  Telangana updates  

Other Articles