Charlie hebdo unite peace rallies

Charlie Hebdo attack, Charlie Hebdo attack peace rally, paris peace rally, paris unite rally, Charlie Hebdo attack update, Charlie Hebdo terrorist attack, cherif kouachi, syed kouachi, paris attack, world terrorist attacks, world latest news

Charlie Hebdo peace rallies : lakhs of people gathered in charlie hebdo attack peace rally. 40 countries representatives and lakhs of people participated in peace unite rally on Charlie Hebdo attack

మీ స్పూర్తి.. అద్బుతం, అనిర్వచనీయం

Posted: 01/12/2015 10:03 AM IST
Charlie hebdo unite peace rallies

ప్యారిస్ ఘనటతో ఫ్రాన్స్ నే కాక ప్రపంచ దేశాలను వణికించిన ఉగ్రవాదంపై ప్రజలు కదంతొక్కారు. చార్లీహెబ్డో మృతులకు నివాళి అర్పించే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలి అనే పిలుపుకు స్పందిస్తూ.. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన శాంతి ర్యాలీలో లక్షల మంది ప్రజలు పాల్గొని తామంతా ఒక్కటే అని చాటారు. కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తం పది లక్షల మందికి పైగా ఐక్యతా శాంతి ర్యాలీలో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.

సామాన్య ప్రజలతో పాటు బ్రిటన్ ప్రధాని కేమరూన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ సహా పలు దేశాల నేతలు ర్యాలీకి మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. శాంతి ర్యాలీతో ఉగ్రవాదంపై అంతా కలిసి పోరాడుతామని స్పూర్తిని ప్రపంచానికి చాటటంపై ఐక్యరాజ్య సమితి సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లపై అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఐరాస ప్రతినిధులు తెలిపారు. చార్లీ హెబ్డో దాడి, తదనంతర పరిణామాల్లో మొత్తం 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడులకు కారణం అయిన కౌచి తీవ్రవాద సోదరులను ఫ్రాన్స్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charlie Hebdo  peace rally  paris attack  

Other Articles