ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లోకెక్కే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. తెలిసీ, తెలియక చేస్తాడో ఎవరూ ఊహించలేరు కానీ.. కొంతమందికి ఆయన వ్యాఖ్యలు కడుపుబ్బా నవ్వించేస్తే, మరికొంతమందికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తాయి. ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఎప్పుడూ కొన్ని కామెంట్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసే ఈ దర్శకుడు.. ఇటీవలే ‘గోపాల గోపాల’ విడుదలకు ముందు ట్వీట్స్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
శంకర్ డైరెక్ట్ చేసిన ‘ఐ’ చిత్రం సంక్రాంతి రేస్’లో వుండగా.. అదే సమయంలో ‘గోపాల’ రిలీజైతే అప్పుడు ‘పీకే’ పరిస్థితి ఏంటి? అని సందేహం వ్యక్తం చేశాడు వర్మ. అంటే.. గోపాల గోపాల చిత్రానికి అంత గొప్పదనం ఏముందంటూ చెప్పకనే చెప్పి.. కాంట్రోవర్సీ క్రియేట్ చేశాడు. దాంతో ఆగ్రహానికి గురైన పవన్ ఫ్యాన్స్.. ‘ఇక్కడ పీకే అంటే పవన్ కల్యాణ్ అనే కదా అర్థం.. అంటే మా హీరో సినిమాకి అంత సత్తా లేదనేది నీ ఉద్దేశమా అంటూ వర్మపై మండిపడ్డారు.
ఇక అప్పటి నుంచి స్పందించని వర్మ.. తర్వాత ఆలస్యంగా తనదైన రీతిలో ట్వీట్ చేసి వార్తల్లోకెక్కాడు. ‘పీకే అంటే నా ఉద్దేశం పవన్ కల్యాణ్ అని కాదు.. అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే మూవీ గురించే నేను వ్యాఖ్యానించాను' అని చెబుతూ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. అమీర్ లాగే పవన్ సినిమాకి గొప్ప స్ర్కిప్ట్, గొప్ప దర్శకుడు అవసరం లేదని.. కేవలం ఆయా సినిమాల్లో వాళ్లు కనిపిస్తే చాలు ఆ మూవీ పెద్ద హిట్ అంటూ సమాధానం ఇచ్చాడు.
అయితే.. ఇలా ట్వీట్ చేయడంతో కూడా ఇప్పుడు వర్మ మళ్లీ ఇరుక్కుపోయినట్లున్నాడు. పవన్ ప్రశంసించడం బాగానే వుంది కానీ.. గోపాలకు గొప్ప స్ర్కిప్ట్ లేదని, గోపాల డైరెక్టర్ డాలీ గొప్ప దర్శకుడు కాదని వర్మ ఎలా చెప్పగలడు అని సందేహాన్ని వ్యక్తం చేశారు. పైగా.. ఈ చిత్రంలో వున్న మరో సీనియర్ హీరో వెంకీ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. క్రెడిట్ మొత్తం పవన్ కే దక్కుతుందన్నట్లుగా వర్మ చెప్పడంతో వెంకీ అభిమానులు ఆయన మీద మండిపడ్డారు. ఈ వ్యవహారంపై వర్మ ఎలా స్పందిస్తాడో?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more