Eggs stone thrown at kejriwal

eggs stone thrown at kejriwal, AAP chief Arvind Kejriwal, unidentified miscreant, Sultanpur Majra Assembly, north west Delhi, delhi police, Eggs, stone thrown, Delhi Assembly Polls, Arvind Kejriwal

An unidentified miscreant today threw eggs and a stone at AAP chief Arvind Kejriwal at a rally in Sultanpur Majra Assembly constituency in north west Delhi.

ఢిల్లీలో మరోమారు కేజ్రీవాల్ కు పరాభవం..

Posted: 01/14/2015 10:49 AM IST
Eggs stone thrown at kejriwal

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అద్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు మరోమారు ఢిల్లీ వీధుల్లో పరాభవం ఎదురైంది. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్బంగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పూరా మాజ్రాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆయనపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటనలో అర్వింద్ కేజ్రీవాల్ ఎటువంటి గాయాలు కాలేదని ఆప్ వాలంటీరు ఒకరు తెలిపారు. దుండగులు విసిరిన కోడిగుడ్లు, రాళ్లు కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న వేదికపై మాత్రమే పడ్డాయని, వాటి వల్ల కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అయితే పోలీసులు మాత్రం కేజ్రీవాల్ పై దాడికి యత్నించిన దుండగుడి అచూకీని పట్టే పనిలో పడ్డారు. కాగా సుల్తాన్ పూరా మాజ్రాలో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండోసారి. గత సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా కూడా కేజ్రీవాల్ పై దాడి జరిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eggs  stone thrown  Delhi Assembly Polls  Arvind Kejriwal  

Other Articles