Former aap leader shazia ilmi likely join bjp may contest

sazia ilmi, arvind kejriwal, aam aadmi party, bjp, delhi assembly election 2015, president Satish Upadhyay, maharastra aap leader shazia ilmi, shazia ilmi joining bjp, shazia ilmi contesting on aravind, ilmi contesting opposite kejriwal, Bharatiya Janata Party, Aam aadmi party, congress,

Former Aam Aadmi Party leader from Maharashtra, Shazia Ilmi will be campaigning on behalf of Bharatiya Janata Party for the upcoming Delhi Assembly Elections which are slated on February 7th.

కేజ్రీవాల్‌పై బరిలోకి ఆప్ మాజీ నేత సజియా ఇల్మీ?

Posted: 01/14/2015 10:28 PM IST
Former aap leader shazia ilmi likely join bjp may contest

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఫిబ్రవరి న జరగనున్న ఎన్నికలలో చెక్ పేట్టేందుకు బీజేపి గట్టి వ్యూహాన్నే రచిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ అమ్ ఆద్మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం లోపించిందని, ఆరోపిస్తూ తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నాయకురాలు సజిలా ఇల్మీ నే ఆయనపై పోటికి దింపేందుకు బీజేపి వ్యూహ రచన చేస్తోంది. ఈ మేరకు గురువారం షాబియా ఇల్లీ బిజెపిలో చేరే అవకాశం ఉందని బీజేపి వర్గాల సమాచారం.

అయితే రానున్నఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌పై బిజెపి అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో వారిద్దరి మధ్య పోటీ జరిగవచ్చునని బీజేపి పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని ఆరోపిస్తూ గత ఏడాది ఇల్మీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. స్వరాజ్ గురించి మాట్లాడుతున్న పార్టీ తన విషయంలో మాత్రం దాన్ని పాటించడం లేదని ఆమె విమర్శించారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఇల్మీ ఓటమి పాలయ్యారు.

బిజెపి అభ్యర్థి అనిల్ శర్మ చేతిలో ఆమె కేవలం 326 ఓట్ల తేడాతో ఆర్‌కె పురం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఇదిలావుండగా, గత ఎన్నికలలో ఆప్ తరపున పోటీ చేసిన షాజియా ఇల్మీ.. మతం మాటున ఓట్లను అడిగి.. వివాదంలో చిక్కుకున్నారు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ఈ తరుణంలో బీజేపి అమెను ఏరి, కోరి పార్టీలోకి చేర్చుకుని, కేజ్రీవాల్ పై పోటీకి నిలపడంపై కూడా విమర్శలకు తావిస్తోంది. ఒక వైపు తాము అన్ని వర్గాల వారిని అదరిస్తామని ప్రజలకు చెప్పకనే బీజేపి చెబుతోందన్న వార్తలు బలంగా వినబడుతుండగా, మరో వైపు మతం మాటున ఓట్లు అడిగిన ఇల్మీని బీజేపి ప్రోత్సహించడంతో.. పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కూడా విమర్శలు పెల్లుడిక్కుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sazia ilmi  arvind kejriwal  aam aadmi party  bjp  delhi assembly election 2015  

Other Articles