Kejriwal kiran bedi and ajay maken files the nominations

Bharatiya Janata Party, BJP, Kiran Bedi, Aam Aadmi Party, Arvind Kejriwal, congress ajay maken, Delhi assembly elections, nominations final day,

Officially entering the poll arena, Bharatiya Janata Party's (BJP) Kiran Bedi and Aam Aadmi Party's Arvind Kejriwal filed their nominations for the Delhi Assembly elections

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, బేడీ, మకెన్..

Posted: 01/21/2015 06:13 PM IST
Kejriwal kiran bedi and ajay maken files the nominations

ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇప్పటికే ప్రకటించబడిన అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన ఐఎఎస్ అదికారిని కిరణ్ బేడి, కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల ఇంచార్జ్ గా అన్ని తానై చూస్తున్న అజయ్ మకెన్లు ఇవాళ నామినేషన్ లను దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో పోలిస్తే కేజ్రీవాల్ సంపద ఈసారి రూ.2లక్షలకు తగ్గింది. ఆయన తన ఆదాయ వివరాలను నామినేషన్ పత్రాల్లో దాఖలు చేశారు. తనపై 10 కేసులున్నాయని కేజ్రీవాల్ అఫిడవిట్లో పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా నామినేషన్ వేశారు. ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి అమె నామినేషన్ దాఖలు చేశారు. బీజేపి నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో కిరణ్ బేడీకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో వచ్చిన అమె తన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అన్ని తానై చూసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ కూడా పార్టీ శ్రేణులు, నేతలతో కలసి వెళ్లి తన నామినేషన్ ను ధాఖలు చేశారు. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా నేడు నామినేషన్ వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుండడంతో నేతలు, బరిలో నిలిచేందుకు ఉత్సహాన్ని కనబరుస్తున్న పలువురు స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aravind kejriwal  kiran bedi  ajay maken  nominations  

Other Articles