Congress mp shashi tharoor controversial comments modi bjp party

shashi tharoor news, bjp party news, narendra modi news, shashi tharoor narendra modi, shashi tharoor bjp party news, shashi tharoor congress meeting, shashi tharoor case, shashi tharoor controversies

congress mp shashi tharoor controversial comments modi bjp party : congress mp shashi tharoor praises narendra modi while controversial comments on bjp party

శశిథరూర్ వ్యవహారశైలి ఏంటో అర్థం కావట్లేదు?

Posted: 02/02/2015 02:00 PM IST
Congress mp shashi tharoor controversial comments modi bjp party

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారశైలిలో రానురాను కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వున్నట్లుగా ఇప్పుడు కనిపించడంలేదు. కొత్తకొత్త పదజాలంతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈయన ప్రస్తుత వ్యవహారశైలి చూస్తుంటే.. ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

గతంలో ప్రధాని మోడీని ప్రశంసించిన శశిథరూర్.. ఈసారి కూడా అలాగే ఆయనన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మోడీని ప్రశంసించడం బాగానే వుంది కానీ.. ఇదే సమయంలో బీజేపీ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదట మోడీ గురించి మాట్లాడిన ఆయన.. ‘‘పనిపై అత్యంత శ్రద్ధ చూపుతూ, ఓ మాస్టర్ కమ్యూనికేటర్’లా వున్న వ్యక్తిని మోడీరూపంలో మనమంతా చూస్తున్నాం’’ అంటూ పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. ‘‘సంకుచిత హిందుత్వ అజెండాను బీజేపీ పార్టీ సిగ్గులేకుండా ప్రోత్సాహిస్తోంది’’ అని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో శశి.. ‘‘ప్రధాని మోడీ మాట్లాడే విధానం, స్లోగన్లు, అసమానమైన ప్రసంగాలు, తనతో ఫోటోలకు అవకాశం కల్పించడం తదితర అంశాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి’’ అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి కమ్యూనికేషనే ప్రధానబలమని అన్నారు. ఇదిలావుండగా.. తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న రూమర్లను కొట్టిపారేసిన ఆయన.. కాంగ్రెస్ నేతగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shashi tharoor controversies  narendra modi  bjp party  

Other Articles