తెలుగు రాష్ట్రాలను కేంద్రం ఎట్టకేలకు కరుణించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు గాను పన్ను మినహాయింపులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు, అవి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇవ్వాల్సిన పన్ను ప్రోత్సాహకాలను ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్రం నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పితే కొత్త ప్లాంటు, యంత్రాలపై 15 శాతం ఆదనపు డిప్రిసియేషన్‌ను అమలు చేస్తారు.
అలాగే నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే అదనపు పెట్టుబడి భత్యం 15 శాతం ఇస్తారు. ఐదేళ్ల వరకు ఎప్పుడు కొత్త ప్లాంటు, యంత్రాలు నెలకొల్పినా ఈ భత్యం వర్తిస్తుంది. ఐదో సంవత్సరంలో పెట్టుబడి పెట్టినప్పటికీ ఇది అందుబాటులో ఉంటుంది. అదనపు డిప్రిసియేషన్ భత్యం, పెట్టుబడి భత్యం అందాలంటే పెట్టుబడులు రూ.25 కోట్లపైన ఉండాలన్న నిబంధన ఏమీ వర్తించదని ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్(డీఐపీపీ) తదితర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది.
కాగా, ఆర్థిక లోటుతో సతమతమవుతున్ననవ్యాంధ్రపై కేంద్రం స్పెషల్ నజరానా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించింది.
2014-15వ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7 జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించింది. ఇది కాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటును పూడ్చడంలో భాగంగా మరో రూ.500 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటుపై అధ్యయనం చేసేందుకు హోం శాఖ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ సిఫారసుల మేరకు రూ.500 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తాత్కాలిక సాయం కింద మొత్తం రూ. 850 కోట్లను అందజేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
అయితే 2014-15 బడ్జెట్లోనే రాజధాని అవసరాలకు, రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.1,180 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజన దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15,594 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తేలగా, ఆ లోటును భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుందనగా.. కేంద్రం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశాలోని వెనుకబడిన జిల్లాలైన కలహండి-బొలంగీర్-కోరాపుట్ (కేబీకే) ప్రాంతాలకు అమలుచేసిన ప్యాకేజీని, బుందేల్‌ఖండ్‌లో అమలుచేసిన ప్యాకేజీని ఆధారంగా చేసుకుని అవే మార్గదర్శకాలకు అనుకూలంగా రాష్ట్రానికి కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more