Andhra pradesh government to complain against governor

AP government complain against Governor, Governor E.S.L. Narasimhan, AP complain against Governor to Centre, governer silent on injustice, K.E Krishnamurthy, Andhra pradesh government, chandrababu naidu, Ap CM chandrababu, AP Deputy CM K.E Krishnamurthy,

The AP government is going to lodge a complaint against Governor E.S.L. Narasimhan with the Centre for remaining silent regarding the injustice being done to AP by TS government.

అన్యాయం జరిగుతున్నా.. మౌనం వహిస్తారా..?

Posted: 02/05/2015 01:31 PM IST
Andhra pradesh government to complain against governor

ప్రభుత్వమా.. ప్రభుత్వమా ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. ఎవరిపైన పిర్యాదులు చేయాలా అని వేచి చూస్తున్నా.. అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహరశైలి. విశాఖ ఉక్కు నగరాన్ని వణికించిన పెను తుఫాను సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న తదనంతర కార్యక్రమాలతో కొండంత ఎత్తుకు వెళ్లిన ప్రభుత్వ ఇమేజ్.. ఇప్పుడిప్పుడే కొంత మసకబారుతున్నట్లుగా కనబడుతోంది. దీనికి కారణం లక్ష్యం కాని వారిని గురి చేసుకుని పిర్యాదులు చేయడమేనని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రగతి సాధకులని, ఇరువురిలోనూ ప్రజాకాంక్ష అధికంగా వుందని పలుమార్లు వ్యాఖ్యలు చేసి ఇద్దరినీ సంతృప్త పరుస్తున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో మరింతగా విమర్శలు వినబడుతున్నాయి. ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలే ఇందుకు కేంద్రబిందువు అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఇబ్బందులు పెడుతున్న అంశంపై ఆయన మాట్లాడుతూ.. అనేక విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం తమను ఇరుకున పెడుతోందని ఆరోపించారు. ఇబ్బందులన్నింటినీ తాము ఎంతో ఓపికగా సర్థుకుపోతున్నట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుకు అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. ఇంతవరకు బాగానే వున్నా..  రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను ఆయన టార్గెట్ చేశారు. తమ పిర్యాదులను గవర్నర్ పెడ చెవిన పెడుతున్నారని ఆరోపించారు. ఇదే మళ్లీ మళ్లీ పునారావృతం అయితే.. గవర్నర్ పైనే కేంద్రానికి పిర్యాదు చేయాల్సి వుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే కేంద్రంలో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వ సాయంతో గవర్నర్ పైా వేటు వేయిస్తామని చెప్పకనే చెబుతున్నారా..? లేక పరోక్షంగా తమ పిర్యాదులను అలకించమని అదేశిస్తున్నారా..? అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇది ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేదిగా వుందని విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Government  Governor E.S.L. Narasimhan  K.E Krishnamurthy  

Other Articles