Ap government should roll back proposals on hike of electricity

ap goverment must roll back electricity hike proposals, andhra pradesh government, andhrapradesh chief minister, AP CM chandrababu, YSR congress party, ycp jaganmohan reddy, ycp party, ycp demands to roll back hike prices, ycp demands to withdraw vat,

andhra pradesh government should roll back proposals on hike of electricity and vat on oil prices demands YSR cp party

విద్యుత్ వడ్డనకు సర్కార్ రెడీ.. ఇప్పుడు తిరగబడమంటారా బాబూ..?

Posted: 02/06/2015 08:16 AM IST
Ap government should roll back proposals on hike of electricity

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను, పెట్రోలు, డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ విద్యుత్ చార్జీల పెంపుపై ఒక్క అడుగు ముందుకు పడినా, ఒక్క పైసా చార్జీలు పెంచినా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించింది. ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాగంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పైసా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాటను విస్మరించారాన్నారు. 2013-14లో పెంచిన విద్యుత్ చార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు అదికారంలోకి వచ్చిన 8 మాసాల్లోనే మళ్లీ విద్యుత్ చార్జీలను పెంచి తన నైజాన్ని చాటుకున్నారని విమర్శించారు.

 1994 నుంచి నేటివరకు ఈ 21 ఏళ్ల కాలంలో టీడీపీ మొదటి పదేళ్లు పరిపాలించి ఏటా కరెంటు చార్జీల వాత పెట్టే విధానాన్ని అనుసరించిందని గుర్తుచేసింది. 2004-2009 మధ్య దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో మాత్రమే రాష్ట్రంలో ఏ ఒక్క కేటగిరీకి ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తుచేసింది. 2004-2009 మధ్య రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్తు 800 కోట్ల యూనిట్ల నుంచి 1,400 కోట్ల యూనిట్లకు పెరిగినా ఆ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. విద్యుత్ చార్జీలను పెంచితే 1999 తరహా ఉద్యమానికి తాము చేపడతామని హెచ్చరించింది


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP government  YSRcp  electricity  vat  

Other Articles