Ap special status cm babu tour arun jautly modi

special status to ap, cm babu arun jautly , narendra modi, bifercation act, central fund

ap special status cm babu tour arun jautly modi : ap cm meet arun jaitly and pm modi about to discuss the special status to ap

ఎపికి భారీగా నిధులు ఇస్తాం కానీ ప్రత్యేకం కష్టమే

Posted: 02/09/2015 09:54 AM IST
Ap special status cm babu tour arun jautly modi

ఏపికి ఫ్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో చేసిన హామీ అములు కష్టమేనని కేంద్రం నుండి సూచనలు రావడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర  ఆర్థిక మంత్రి  అరుణ్ జైట్లీని కలిసిన చంద్రబాబు ఏపి పరిస్థితులను వివరించారు. కష్టాల సుడిగుండంలో ఉన్న రాష్ట్రానికి ఎలాగైనా ప్రత్యేక హోదా కల్పించాలని  కోరారు. పరిస్థితుల సాకుతో ప్రత్యేక హోదా కల్పించలేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెబుతాం అని చంద్రబాబు జైట్లీకి వివరించారు. కేంద్రం హామీలు నెరవేర్చలేదని ఎవరైనా కోర్టుకు వెళితే కేంద్రం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తు 12 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని, అందుకే అభివృద్ది, సంక్షేమ పథకాల్లో కొంత కోత వెయ్యాల్సివచ్చిందన్నారు. విభజన చట్టం సెక్షన్ 46 కింద కేంద్రం ఏం చెయ్యాలో నివేదించారు. ఇక నూతన రాజధాని నిర్మాణ పనుల గురించి కూడా బాబు వివరించినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ కు అనుకున్న దానికంటే ఎక్కువగానే సహాయం చేస్తామని ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నలను మాత్రం దాటవేశారు. అయితే కేంద్రం తొలి విడతగా విడుదల చేసిన నిధులపై విమర్శలు రావడంతో దానిపైనా స్పష్టత ఇచ్చారు.ఇప్పటికి కేవలం తొలి విడత కింద కొన్ని నిధులను విడుదల చేశామని, మరిన్ని నిధులను కూడా విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక మోదీతోనూ సహావేశంలో ఈ అంశాలనే ప్రస్తావించిన ఆయన ప్రధాని వద్ద నుండి మాత్రం ఎలాంటి ప్రకటన చేయించలేకపోయారు. అన్ని విషయాలపై జైట్లీనే స్పష్టత ఇస్తారని మోదీ ప్రకటించారు.

-అభినవచారి

RELATED ARTICLES: తూచ్...ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు

తూచ్...ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు
తూచ్...ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : special status to ap  cm babu arun jautly  narendra modi  

Other Articles