మూడు పార్టీల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రారంభమైంది. అయితే బీజేపి, ఆప్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.. కాగా పటిష్ట భద్రత నడుమ ఢిల్లీలోని 14 కేంద్రాల్లో లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 70 స్థానాల తుది ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ జరిగిన శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు స్పష్టమైన మెజారిటీని అంచనావేయగా.. వాటిని తోసిపుచ్చిన బీజేపీ 38 స్థానాల్లో గెలుస్తామని పేర్కొంది.
ఫలితాలపై ఆందోళన లేదు.. ఫలితాల గురించి ఉత్కంఠ కానీ, ఆందోళన కానీ లేదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ అన్నారు. గత 17 రోజులుగా సాధ్యమైనంత వరకు కృషి చేశానని, తన చేతుల్లో లేని ఫలితాల గురించి ఆదుర్దా పడబోనని కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ ఎన్నికలను మోదీ పాలనకు రిఫరెండంగా పేర్కొంటున్నందున.. ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కాగా, సదర్‌బజార్ స్థానం నుంచి పోటీ చేసిన అజయ్ మాకెన్ ఆ స్థానంలో ఓడిపోనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. అదే జరిగితే పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తానని మాకెన్ తన సన్నిహితులతో స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ 3, 4 స్థానాలను మించి గెలుచుకోబోదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. అది పార్టీకి వినాశకరమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more