Vijayawada women fell down from appartment

woman fell down from apartment, vijaywada woman fell down from apartment, kristhurajapuram woman fell down from apartment,, fell down from apartment, vijayawada fire services,

vijayawada women fell down from appartment

మృత్యువు ఒడికి చేరి.. తప్పించుకున్న మహిళ

Posted: 02/10/2015 08:28 AM IST
Vijayawada women fell down from appartment

శివుడి అజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అన్న మాట అక్షరసత్యంగా నిలుస్తుంది. భూమిపై నూకలు వుంటే పెద్ద ప్రమాదమైనా దిగదుడుపేనని పెద్దల మాటకు నిదర్శనంగా నిలిచింది విజయవాడలోని ఈ ఘటన. ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. విజయవాడ క్రీస్తురాజపురంలోని అరుణ అపార్ట్‌మెంట్ లో వల్లూరు విజయలక్ష్మి(37) దంపతులు నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆమె దండేనికి ఆరేసిన బట్టలు తీస్తుండగా పట్టుతప్పి ఐదో అంతస్తులోంచి జారిపడ్డారు.

అలా మూడో అంతస్తులోని గ్రిల్స్ మధ్యలో ఆమె కాలు ఇరుక్కోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు 108, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తలకిందులుగా వేలాడుతూ ఆమె చేసిన ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గ్రిల్స్‌కు వేలాడుతున్న ఆమెను కిందికి దించారు. అనంతరం విజయలక్ష్మిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె చేయి, కాలు ఫ్రాక్చర్ అయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaywada  woman  fell down from apartment  

Other Articles