Kiren bedi loses from krishna nagar

kiran bedi loses from krishna nagar, BJP chief minister candidate losses battle, aap candidate sk bagga wins over kiran bedi, sk bagga wins on kiran bedi, kiran bedi losses battle, krishna nagar consttuency, delhi assembly polls 2015, aravind kejriwal, aap landslide victory

BJP chief minister candidate kiran bedi losses from krishna nagar, aap candidate sk bagga wins over bedi with a majority of 2050 votes

ఆప్ చేతిలో ఓడిన బీజేపి సీఎం అభ్యర్థి కిరణ్ బేడి...

Posted: 02/10/2015 02:08 PM IST
Kiren bedi loses from krishna nagar

భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద షాక్ తగిలింది. ఎన్నికలలో సర్వే సంస్థలు ముందస్తుగా వేసిన అంచనాలన్నీ తారుమారాయ్యాయి. ఎన్నికలలో నమె మంత్రాలు, అమిత్ సా మిషన్లను ప్రజలు తిరస్కరించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె  ఆప్ అభ్యర్తి ఎస్కే బగ్గా చేతిలో పరాజయం పొందారు. కిరణ్ బేడీ2050 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ఆమె పేర్కొన్నారు.

కాగా అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఎన్నికలు వచ్చే వరకూ బీజేపీ పరిస్థితి బాగానే కనిపించనప్పటికీ.. కిరణ్ బేడీ ఎంపికతోనే పార్టీ డీలా పడిందనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీ చేసింది చిన్నపాటి తప్పుగానే కొందరు చెబుతున్నప్పటికీ.. వెనక్కి తీసుకోలేనంత తప్పుగా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లాంటి చిన్న ఎన్నికను బీజేపీ భారీగా ఎంచుకోవడం ఆ వ్యూహాలు బెడిసి కొట్టాయనే ప్రధానంగా వినిపిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kiran bedi  BJP chief minister candidate  krishna nagar  

Other Articles