Rss said that delhi defeat by the selecting badi name

panchajanya , rss, rastriya swyam sevak, delhi elections, kejriwal

rss magazine panchajanya publish a article on delhi polls. in the article said bjp got defeat by kiran bedi name as delhi cm.

కిరణ్ బేదీ వల్లనే ఓటమి వచ్చింది: ఆర్ఎస్ఎస్

Posted: 02/17/2015 12:14 PM IST
Rss said that delhi defeat by the selecting badi name


ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్‌ బేదీని ప్రకటించడాన్ని బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుపట్టింది. బేదీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికలో బీజేపీ తప్పుచేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పాంచజన్య పత్రికలో పేర్కొంది. అయితే ఈవ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. పాంచజన్య పత్రికలో ఢిల్లీ ఎన్నికల పై రెండు భాగాలుగా ఆకాంక్షా ఓంకి ఉడాన్ ( ఆశలు ఎగిపిపోయాయి ) అంటూ కవర్ స్టోరీ ప్రచురించింది. గతంలో 32 సీట్లు సాధించిన బీజేపి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమిపాలైందని అందులో ప్రశ్నించింది.వాగ్దానాలు, ప్రశ్నలు, కేజ్రీవాల్ అంటూ కొన్ని ప్రశ్నలను సందించింది. బీజేపి కిరణ్ బేదిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేసిందా..హర్ష వర్దన్ లాంటి స్థానిక నేతలు ఎన్నికల్లో ఉంటే ఫలితాలు మరోలా ఉండేవా అని అభిప్రాయపడింది.  మొత్తానికి కిరణ్ బేది వల్లనే ఢిల్లీలో బీజేపి ఘోర పరాభవానికి లోనైందని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతోంది.  బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బేదీ పేరు ప్రకటనను సంఘ్‌ కూడా ఆమోదించిందని బీజేపీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panchajanya  rss  rastriya swyam sevak  delhi elections  kejriwal  

Other Articles