Tsunami advisory lifted after 6 9 earthquake off northeast japan

strong jolts shakes japan, Tsunami advisory lifted after quake in japan, preliminary magnitude of 6.9 jolted northern Japan, earlier quake triggered evacuation warnings, japan, earth quake, tsunami, tokyo

A strong earthquake with a preliminary magnitude of 5.7 jolted northern Japan on Tuesday, hours after an earlier quake triggered evacuation warnings in towns along the coast.

సునామీ వార్తలతో ఆందోళన.. రాదని తేల్చిన అధికారులు

Posted: 02/17/2015 01:33 PM IST
Tsunami advisory lifted after 6 9 earthquake off northeast japan

జపాన్ లో మరోమారు భూమి కంపించింది. ఈశాన్య జపాన్‌లో ఇవాళ ఉదయం 6.9 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంప కేంద్ర సముద్రం భాగంలో వుండటంతో జపాన్ వాతావరణ కేంద్రం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆనక తేరుకున్న వాతావరణ శాఖ అధికారులు సునామి సంభవించదని చెప్పడంతో జపాన్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.  ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించిందిని దీంతో మరోమారు సునామి రాదని వారు చెప్పారు.

ఉత్తర జపాన్ లో సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం. ఈ భూకంపం ఉత్తర టోక్యోకు 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2011లో ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 18వేల మంది మృత్యువాత పడ్డారు. పుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇదే ప్రాంతంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. కాగా చిన్నపాటి సునామీ రావడంతో ఉత్తర జపాన్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  earth quake  tsunami  tokyo  

Other Articles