Airports take robert vadra off no frisking list

airports take robert vadra off no frisking-list, goa airport officials gives vadra shock, robert vadra, sonia gandhi, priyanka gandhi, airport authority, frisking list, Congress president Sonia Gandhi's son-in-law Robert Vadra, priyanka gandhi husband Robert Vadra, bjp, NDA government, modi sarkar,

Some airports have begun blanking out the name of Congress president Sonia Gandhi's son-in-law, Robert Vadra, from the list of those exempt from frisking before flying.

రాబర్ట్ వాద్రాకు అధికార దర్ఫం తొలగింది..

Posted: 02/22/2015 10:24 PM IST
Airports take robert vadra off no frisking list

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్ తగిలింది. గోవా ఎయిర్ పోర్టు అధికారులు షాక్ ఇచ్చారు. యూపీఏ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పరంగా అందే అన్ని రకాల ప్రత్యేక సేవలు పొందిన ఆయనకు ఇకపై ఆ హోదా కల్పించబోమంటూ ఏకంగా ఎయిర్ పోర్టులోనే నోటీసు అంటించారు.

అర్హత లేని వ్యక్తులకు ప్రత్యేక సేవల్ని నిలిపివేయాలంటూ ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. పౌర విమానయాన శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సేవలకు అర్హులైన వ్యక్తుల జాబితా నుంచి రాబర్ట్ వాద్రా పేరును తొలిగించామని గోవా ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులోని జాబితాలో వాద్రా పేరును ప్లాస్టర్తో మూసివేశారు. 'ఏ చట్టప్రకారం ఆయనకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు?' అని సాధారణ ప్రయాణికులు కూడా తరచూ ప్రశ్నించేవారని గోవా ఎయిర్ పోర్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.

ప్లాస్టర్‌తో మూసివేయడంతో రాబర్ట్ వాద్రా పేరును మూసివేయడంతో కొందరు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. గోవాతోపాటు చాలా విమానాశ్రయాల్లో రాబర్ట్ వాద్రా పేరును ప్రత్యేక సేవలకు అర్హులైన జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robert vadra  sonia gandhi  priyanka gandhi  airport authority  frisking  

Other Articles