Pakistan militants attacked on india at boarder

pakistan, fire, police, terrorists, indian army, rajbhag police station, khatwa

pakistan militants attacked on india at boarder. pakistan militants again attacked at khatwa dist. rajbhag police station. in this incident three indian army men died and one terrorist also died.

పాకిస్థాన్ మరోసారి ఉగ్రపంజా విసిరింది

Posted: 03/20/2015 10:09 AM IST
Pakistan militants attacked on india at boarder

భారతదేశానికి దాయాది పోరు తప్పడం లేదు. అయితే పాకిస్థాన్ గత కొంత కాలంగా రెచ్చపోయి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. భారత్ కు ఎన్నిరకాలుగా నష్టం కలుగుతుందో అన్ని ప్రయత్నాలను చేస్తోంది. చీటికి మాటికి కాల్పులు జరుపుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. గతంలో ఓ సారి భారత్ చేతిలో భయంకరంగా దెబ్బతిన్నా పాకిస్థాన్ కు బుద్ది రాలేదు.  అంతర్జాతీయంగా పాకిస్థాన్ వైఖరిపై విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా భారత భూభాగాల్లోకి ప్రవేశించడం, కాల్పులకు ప్రేరేపించడం చేస్తోంది.

తాజాగా పాకిస్థాన్ మరో సారి భారత్ పై దాడికి సిద్దపడింది. భారత్ పైకి ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాక్ మరో సారి తన దొంగబుద్దిని చూపింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఒక్క సారిగా కాల్పులకు దిగడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. కత్వా జిల్లాలోని రాజ్బాగ్ పోలీస్ స్టేషన్పై తీవ్రవాదులు తెల్లవారుజామున దాడి చేశారు.  పోలీసులు వెంటనే స్పందించి తీవ్రవాదులపై కాల్పులు జరిపారు.దాంతో దాడికి పాల్పడుతున్న ఓ ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు.  ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూ- పఠాన్కోట్ జాతీయరహదారికి సమీపంలోని  పోలీసు స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  fire  police  terrorists  indian army  rajbhag police station  khatwa  

Other Articles