In world cup 2015 1st semi finals south africa vs newzeland sothafrica openers loose there wickets

southafrica, newzeland, worldcup, dee cock, amla, Faf du Plessis ,Rilee Rossouw

in world cup 2015 1st semi finals south africa vs newzeland sothafrica openers loose there wickets. in this world cup season 1st semis amtch between the siuthafrica and newzeland, siuthafrica openers de cock, amla lost their wickets at 31 runs.

నిరాశపరిచిన సౌతాఫ్రికా ఓపెనర్లు.. సఫారీ స్కోర్ 111/2

Posted: 03/24/2015 08:28 AM IST
In world cup 2015 1st semi finals south africa vs newzeland sothafrica openers loose there wickets

ప్రపంచ కప్ 2015 లో భాగంగా జరుగుతున్న తొలి సెమీస్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 31 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డీకాక్ 14 పరుగుల వద్ద రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆమ్లా 10 పరుగులకే ఔటయ్యాడు. దాంతో సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు ఆమ్లా. డీకాక్, ఆమ్లాలను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆరంభంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓపెనర్లు ఆమ్లా, డీకాక్ లకు  లైఫ్ ఇచ్చారు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీకాక్ ఇచ్చిన క్యాచ్ ను కీపర్ రోచి పట్టలేకపోయాడు. సౌతీ బౌలింగ్ లో ఆమ్లా ఇచ్చిన క్యాచ్ పట్టేందుకు బౌల్ట్ అందుకోలేకపోయాడు. అయితే తనకు లభించిన లైఫ్ ను ఆమ్లా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఆమ్లా 10 పరుగుల వద్ద ట్రెంట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.14 బాల్స్ లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసిన ఆమ్లా మొదటి వికెట్ ను సమర్పించి న్యూజిలాండ్ కు మంచి కిక్కునిచ్చాడు. డీకాక్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్లీసిస్ 67 బంతుల్లో 4 ఫోర్లు బాది 41 పరుగులతో, రోసో 44 బంతుల్లో 2 ఫోర్లు బాది 38 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి 25.4 ఓవర్లలతో సౌతాఫ్రికా 111 పరుగులు చేసింది.

ముందు నుండి మాట్ వేఫరేట్ గా ఉన్న సౌతాప్రికా జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్లు చెమటలు పట్టిస్తున్నారు. కట్టుదిట్టమైన ఫీల్డిండ్ తో పరుగుల సంగతి పక్కన ఉంచితే కనీసం క్రీజ్ లో కాసేపు నిలదొక్కుకోవడానికే సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు ఆపసోపాలు పడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ప్లాన్ వర్కౌట్ అయింది.  సఫారీ బ్యాట్స్ మెన్లను ఒత్తిడిలోకి నెట్టడంలో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీంతో స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్ లో నలుగురు ఫీల్డర్లను స్లిప్ లో మొహరించాడు. మరొకరిని గల్లీలో పెట్టి బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచాడు. ఈ వ్యూహం ఫలించింది. ఓపెనర్లు ఇద్దరినీ బౌల్ట్ పెవిలియన్ కు పంపాడు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : southafrica  newzeland  worldcup  dee cock  amla  Faf du Plessis  Rilee Rossouw  

Other Articles