aam aadmi party crisis | arvind kejriwal | delhi latest news

Delhi cm kejriwal says that dont worry all is well in aap party

arvind kejriwal news, aravind kejriwal updates, arvind kejriwal interview, arvind kejriwal press meet, arvind kejriwal updates, kejriwal news, kejriwal gallery, kejriwal press

delhi cm kejriwal says that dont worry all is well in aap party : Finally Delhi cm clarifies that there is no more crisis in their party. "There is no need for worry. The party is doing fine. We will manage it well," kejriwal said.

ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ‘ఆల్ ఈజ్ వెల్’!

Posted: 03/30/2015 04:37 PM IST
Delhi cm kejriwal says that dont worry all is well in aap party

ఆమ్ ఆద్మీ పార్టీలో గతకొంతకాలం నుంచి సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే! ఆమ్ ఆద్మీలో విభేదాలు తారాస్థాయికి చేరిపోడంతో ఈ పార్టీ పేరు ‘ఆప్’ నుంచి ‘నేను’ అనే ముద్రపడింది. ప్రజల సంక్షేమం కోసం పోరాడుతారని భావించి ప్రజలు పార్టీని గెలిపిస్తే.. తమ అధికారం కోసం పార్టీ సభ్యులు గొడవపడటానికే సమయం సరిపోయిందంటూ విమర్శొచ్చాయి. అయితే.. ప్రస్తుతం పార్టీ పరిస్థితి చక్కబడిందని, ఇక నుంచి ఎటువంటి సమస్యాలేదని పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఇప్పటివరకు తమ పార్టీలో చోటు చేసుకున్న వివాదాలన్నీ తొలిగిపోయాయని, ఎటువంటి సమస్యలు లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ పార్టీలో పరిస్థితి చక్కబడిందని అన్న ఆయన.. ‘ఆప్’లో తలెత్తిన సమస్యలను పరిష్కారం చేసుకోగలమని విలేకరులతో స్పష్టం చేశారు. ‘డోన్ట్ వరీ, ఆల్ ఈజ్ వెల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక నుంచి పార్టీ తామంతా రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామన్న హామీ కేజ్రీవాల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఆప్ లో సంక్షోభం ముదరడంతో పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తొలగించారు. ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ నుంచి తమను తొలగించడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారిద్దరి పేర్కొన్నారు. ఇక అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్‌నూ తీసేసినట్లు సమాచారం!

ఇదిలావుండగా.. పార్టీ నుంచి యాదవ్, ప్రశాంత్ లను తీసేసిన అనంతరం ఆదివారం రోజు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ పార్టీ కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా వాళ్లు రాకేష్ సిన్హా, ఎస్పీ వర్మ, మరొక సభ్యుడితోపాటు లోక్ పాల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ఒక కొత్త క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేస్తూ దానికి ఛైర్మన్ గా దినేష్ వాఘేలా నియమించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal updates  delhi cm news  aap party  

Other Articles